దర్శకుల విజువల్స్ కి ప్రాణం పోస్తున్న సంగీత దర్శకులు.. అదిరిపోయే కాంబినేషన్స్ ఇవే..!

సినిమాకి సంగీతం చాలా బలం.బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతకన్నా ప్రాణం.

ఈ రెండు కలిస్తే తప్ప సినిమా విజయవంతం కాలేదు.చాలా సినిమాల్లో కంటెంట్ ఎలా ఉన్నా మ్యూజిక్ తో జనాల్లోకి బాగా రీచ్ అవుతున్నాయి.

సినిమాలోని అన్ని పాటలు బాగుండక్కర్లేదు ఒకటి రెండు పాటలు జనాలకు కనెక్ట్ అయినా కూడా ఆ సినిమా విజయం సాధించడానికి మార్గం సుగమమవుతుంది.

మరి అలాంటి సంగీతాన్ని అందించే సంగీత దర్శకులకు( Music Directors ) సినిమా దర్శకులకు మంచి ర్యాపొ ఉండాలి.

ఇలా అదిరిపోయే కాంబినేషన్స్ తో సినిమాలు హిట్టు చేసుకుంటున్నారు సంగీత దర్శకులు మరియు దర్శకులు.

ఈ మధ్య కాలంలో వచ్చిన ఆ క్రేజీ కాంబినేషన్స్ ఏంటో ఒకసారి ఈ ఆర్టికల్లో తెలుసుకొని ప్రయత్నం చేద్దాం.

ప్రశాంత్ నీల్ రవి బస్రూర్ ప్రశాంత్ నీల్( Prashanth Neil ) తీసిన అన్ని సినిమాలకు రవి బస్రూర్( Ravi Basrur ) మాత్రమే మ్యూజిక్ అందించడం విశేషం.

ఈ మధ్య కాలంలో బ్యాగ్రౌండ్ స్కోర్ తో గట్టి విజయాన్ని అందుకుంది సలార్.

ఇంతకు ముందు వచ్చిన కేజిఎఫ్ చిత్రాలకు సైతం రవి సంగీతాన్ని అందించాడు.వీరి కాంబినేషన్లో మంచి సినిమాలు వస్తాయని ప్రేక్షకులు నమ్ముతున్నారు.

అలాగే ప్రశాంత్ అనుకున్న విజువల్స్ కి రవి ప్రాణం పోస్తున్నాడు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు.

"""/" / అనిరుద్ రవిచంద్రన్ ప్రస్తుతం కోలీవుడ్ మార్కెట్ ని దుమ్ము దులుపుతున్నాడు అనిరుద్( Anirudh ).

ఆయన లేని సినిమా ఉండడం లేదు.అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని చెప్పగానే ప్రతి ఒక్కరు అనిరుద్ కె ఓటు వేస్తున్నారు.

సినిమా ఎలా ఉన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆ సినిమాని లేపడం అతడి స్పెషాలిటీ.

రీసెంట్ గా వచ్చిన జైలర్, విక్రమ్, జవాన్ వంటి చిత్రాలు అనిరుద్ వల్లే విజయం సాధించాయంటే అతిశయోక్తి కాదు.

"""/" / సందీప్ రెడ్డి వంగా హర్షవర్ధన్ సందీప్ రెడ్డి( Sandeep Reddy ) కేవలం ఇప్పటి వరకు మూడు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించగా ఈ మూడు చిత్రాలకు హర్షవర్ధన్( Harshavardhan ) బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడం విశేషం.

సందీప్ రెడ్డి చిత్రాలకు హర్షవర్ధన్ గట్టిగా న్యాయం చేస్తున్నాడు.దాంతో ఈ కాంబోకి మంచి క్రేజ్ ఏర్పడింది.

సొంత పార్టీ నేతలపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు