కాలి పిక్కలు, కండరాలు పట్టేస్తున్నాయా? అయితే ఈ సమస్యకు చెక్ పెట్టండి ఇలా..

ఈ మధ్యకాలంలో చాలామంది వయస్సు తేడా లేకుండా కాళ్ళనొప్పి, పిక్కలు( Leg Pain And Cramps ) పట్టేయడం లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు.

ముఖ్యంగా మోకాలు దిగువ భాగంలో అలాగే కాళ్లకు వెనుక వైపు ఉండే బలమైన కండరాలు పిక్కలు పట్టేస్తున్నాయని అంటూ ఉంటారు.

చాలామందికి ఎక్కువగా రాత్రి సమయంలో పిక్కలు పట్టేయడం లేదా విపరీతమైన నొప్పి రావడం జరుగుతుంది.

ఒక్కొక్కసారి ఈ నొప్పి భరించలేని విధంగా కూడా మారుతుంది.అయితే నొప్పి రావడానికి కారణం ఎక్కువ శ్రమ, ఎక్కువసేపు నిలబడటం, నడవటం, ఒకే చోట కదలకుండా కూర్చోవడం, రక్తనాళాల్లో అవరోధాలు, నరాల మీద ఒత్తిడి లాంటివి అని చెప్పవచ్చు.

అయితే శరీరంలో మెగ్నీషియం( Magnesium ) స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి.

అయితే ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.నొప్పి ఉన్న ప్రదేశంలో ఐసు రుద్దుతూ ఉండాలి.

దీంతో నొప్పి నుండి కాస్త ఉపశమనం కలుగుతుంది. """/" / అదేవిధంగా రాత్రి పడుకునే సమయంలో కాళ్ళ కింద దిండ్లు పెట్టుకొని కళ్ళు ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.

అప్పుడు కాళ్లు బాగా చాచి అటూ ఇటూ కదుపుతూ తేలికపాటి వ్యాయమాలు చేస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

అంతేకాకుండా ఎక్కువగా మెగ్నీషియం సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి.అయితే మెగ్నీషియం సమృద్ధిగా ఉండే ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / పాలకూర, గుమ్మడికాయ విత్తనాలు, బాదంపప్పు, పెరుగు, ఆకుకూరలు వీటన్నిటిలో మెగ్నీషియం సమృద్ధిగా దొరుకుతుంది.

మరీ ముఖ్యంగా అనపకాయ, బూడిద గుమ్మడికాయ ఇలాంటి నొప్పుల నుండి ఉపశమనం కలిగేందుకు సహాయపడతాయి.

అంతేకాకుండా ఇలాంటి నొప్పులు రావడానికి రక్తహీనత కూడా కారణం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అందుకే రక్తహీనత సమస్య ఉందేమో ఒకసారి వైద్యుల వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకోవడం మంచిది.

హరిహర వీరమల్లు తో విసిగిపోయిన క్రిష్ ఏం చేస్తున్నాడో తెలుసా..?