ప‌గిలిన పాదాల‌ను ఉల్లిగ‌డ్డ‌తో నివారించుకోవ‌చ్చు..ఎలాగంటే?

పాదాల ప‌గుళ్లు.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రినో తీవ్రంగా మ‌ద‌న పెట్టే కామ‌న్ స‌మ‌స్య ఇది.

ఒక్కోసారి ప‌గిలిన పాదాల‌తో న‌డ‌వ‌టం చాలా క‌ష్టంగా, బాధాక‌రంగా మారుతుంటుంది.దాంతో ప‌గుళ్ల‌ను నివారించుకోవ‌డం కోసం నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

ర‌క‌ర‌కాల క్రీమ్స్‌, ఆయిల్స్ వాడుతుంటారు.అయితే ఎన్ని చేసినా స‌మ‌స్య ప‌రిష్కారం కాకుంటే ఏం చేయాలో తెలియ‌క ఇబ్బంది ప‌డుతూ ఉంటారు.

అయితే ప‌గిలిన పాదాల‌ను నివారించ‌డంలో ఉల్లిగ‌డ్డ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ఉల్లిగ‌డ్డ‌లో ఉండే కొన్ని ప్ర‌త్యేక‌మైన సుగుణాలు ప‌గుళ్ల‌ను త‌గ్గించి పాదాల‌ను స్మూత్‌గా మారుస్తాయి.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం పాదాల‌కు ఉల్లిగ‌డ్డ‌ను ఎలా వాడితే ప‌గుళ్ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక ఉల్లిగ‌డ్డ తీసుకుని పీల్ తొల‌గించి మెత్త‌గా నూరి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఉల్లిగ‌డ్డ జ్యూస్‌, వ‌న్ టేబుల్ స్పూన్ షుగ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ నిమ్మ ర‌సం, వ‌న్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, రెండు టేబుల్ స్పూన్ల వైట్ టూత్ పేస్ట్ వేసి అన్ని క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌కు ప‌ట్టించి నాలుగైదు నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.

మ‌సాజ్ అనంత‌రం పాదాల‌ను ముప్పై నిమిషాల పాటు ఆర‌బెట్టుకుని.అప్పుడు గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఆపై త‌డి లేకుండా ట‌వ‌ల్‌తో పాదాల‌ను తుడిచి ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్ రాసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే గ‌నుక పాదాల ప‌గుళ్లు క్ర‌మంగా దూరం అవుతాయి.

మ‌రియు పాదాలు మృదువుగా, అందంగా కూడా మార‌తాయి.కాబ‌ట్టి, పాదాల ప‌గుళ్ల‌ను వ‌దిలించుకోవ‌డం కోసం ఏవేవో క్రీములు వాడే బ‌దులు చ‌క్క‌గా ఉల్లిగ‌డ్డ‌తో పైన చెప్పిన విధంగా చేస్తే మంచి ఫ‌లితాన్ని పొందొచ్చు.

మైక్ ఇస్తే చాలు.. స్టేజ్ పై చెత్త వాగుడు వాగుతున్న దర్శకులు