వ్యాక్సిన్ల తయారీలో కీలకంగా మారిన పీత రక్తం!
TeluguStop.com
గుర్రపుడెక్క పీతలు గురించి వినే వుంటారు.ఇవి దాదాపు 450 మిలియన్ సంవత్సరాల క్రితం, అంటే సుమారు డైనోసార్ల కంటే ముందే సముద్రపు లోతుల్లో నివసించిన అతి పురాతన జీవులు.
ఇవి ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జీవులు.ఈ విషయం బయాలజీ చదివిన వారికి తెలుస్తుంది.
వీటి శరీరం వెనుక భాగంలో ఉన్న పొడవైన, స్పైక్డ్ తోక ద్వారా ఈ పేరు పొందాయని ప్రతీతి.
దీని శరీరమంతా సెఫలోథొరాక్స్‌ను దాచిపెట్టే దట్టమైన షెల్ ఉంటుంది.ఇవి 20-25 ఏళ్ల వరకు జీవిస్తాయి.
ఇవి పక్షులవలె గుడ్లు పెట్టడం ద్వారా సంతానోత్పత్తి చేస్తాయి.గుర్రపుడెక్క పీతలు ప్రకాశవంతమైన నీలి రంగు రక్తాన్ని కలిగి ఉంటాయి.
అసలు విషయానికొస్తే, బ్యాక్టీరియా టాక్సిన్స్‌తో కలుషితం అవ్వనటువంటి వీటి బ్లడ్‌ను బేసిగ్గా వ్యాక్సిన్, డ్రగ్స్, మెడికల్ డివైసెస్‌ను పరీక్షించడానికి వినియోగిస్తారు.
ఈ హార్స్‌షూ పీతలు రక్తంలో ప్రత్యేకమైన గడ్డకట్టే ఏజెంట్ LAL (లిములస్ అమీబోసైట్ లైసెట్) ఉంటుంది.
ఇది ఎండోటాక్సిన్ అనే కలుషితాన్ని గుర్తిస్తుంది.ఒకవేళ ఈ ఎండొటాక్సిన్‌లు చిన్న మొత్తంలో వ్యాక్సిన్‌లో లేదా ఇంజెక్షన్ డ్రగ్‌లోకి ప్రవేశించినట్లయితే ఫలితాలు ప్రాణాంతకంగా మారే అవకాశాలు వున్నాయి సుమా.
ప్రతి సంవత్సరం ఫార్మాస్యూటికల్ కంపెనీలు మిలియన్ అట్లాంటిక్ హార్స్‌షూ పీతలను కొనుగోలు చేస్తాయి, లేదంటే స్వయంగా పట్టుకొనే ప్రయత్నం చేస్తాయి.
ఎందుకంటే వీరికి బతికున్న పీతలు మాత్రమే కావాలి.పట్టుకున్న తరువాత వాటి నుంచి రక్తాన్ని సేకరించి, ఆ రక్తాన్ని కొన్ని ప్రత్యేక విధానాలలో నిలువ చేస్తారు.
అలా వాటినుండి రక్తం సేకరించిన తర్వాత తిరిగి వాటిని సముద్రంలోకి విడిచిపెడతారు.
నాని కి శ్రీకాంత్ ఓదెల మీద అంత నమ్మకం ఎందుకు..?