కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదన్న సీపీఎం..!
TeluguStop.com
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి పొత్తు ఉండదని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం తెలిపారు.
ఈ మేరకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ - కమ్యూనిస్ట్ పార్టీల పొత్తు వ్యవహారంపై గత కొన్ని రోజులుగా ఉత్కంఠగా మారిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఉత్కంఠకు తెర దించుతూ కాంగ్రెస్ తో పొత్తు ఉండదని సీపీఎం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే ఒంటరిగా బరిలో దిగనున్న సీపీఎం 17 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆరు చోట్ల పోటీ చేయనుంది.
అలాగే ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఒక్కో స్థానంలో పోటీ చేయనుంది.
దీంతో పాటు మరో మూడు స్థానాల్లోనూ సీపీఎం పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పార్టీ విలువ ఇవ్వడం లేదని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొత్తుల విషయంలో కాంగ్రెస్ నేతలు మాట మార్చారన్నారు.చర్చల్లో ఎన్నో మెట్లు దిగివచ్చామన్న ఆయన అవమానకరంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో విడిగా పోటీ చేయడం తప్ప మరో మార్గం లేదని తెలిపారు.
అల్లు అర్జున్ తో తనని తాను పోల్చుకున్న పల్లవి ప్రశాంత్… కాస్త ఓవర్ అయిందంటూ?