సూర్యాపేట డిఎస్పీ జి.రవిని కలిసిన సిపిఎం నాయకులు
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:సూర్యాపేట డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జి.రవిని( DSP G Ravi ) శనివారం సిపిఎం జిల్లా నాయకత్వం కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాకప్పి సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట, తుంగతుర్తి( Thungathurthy ) నియోజకవర్గలో శాంతిభద్రతలను కాపాడి, రాజకీయాలకతీతంగా ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు.
గతంలో ఈ ప్రాంతం నుండి ఎస్సైగా,సీఐగా బాధ్యతలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారని గుర్తు చేశారు.
డిఎస్పీని కలిసిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టిపల్లి సైదులు,జిల్లా కమిటీ సభ్యులు కందాల శంకర్ రెడ్డి,జె.
నరసింహారావు,సిపిఎం నాయకులు మండల్ రెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మోక్షజ్ఞకు ప్రశాంత్ వర్మ హిట్ ఇవ్వగలడా.. ఆ ఫ్లాప్ చూసి టెన్షన్ మొదలైందిగా!