సీపీఎం అభ్యర్థుల జాబితా విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీఎం అభ్యర్థుల జాబితాను పార్టీ ప్రకటించింది.ఈ మేరకు 14 మంది అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం వెల్లడించారు.

అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తమ్మినేని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో 14 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసిన ఆయన మరో 3 స్థానాల అభ్యర్థులను సాయంత్రం లోపు ప్రకటిస్తామని తెలిపారు.

తొలి జాబితా అభ్యర్థులు.: పాలేరు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని తమ్మినేని వీరభద్రం తెలిపారు.

ఇక భద్రాచలం నుంచి కారం పుల్లయ్య, అశ్వారావుపేట -అర్జున్, మధిర - పాలడుగు భాస్కర్, వైరా - భూక్య వీరభద్రం, ఖమ్మం - ఎర్ర శ్రీకాంత్, సత్తుపల్లి - భారతి, మిర్యాలగూడ - జూలకంటి రంగారెడ్డి, నకిరేకల్ - వెంకులు, భువనగిరి - నర్సింహా, జనగాం - కనకారెడ్డి, ఇబ్రహీంపట్నం - యాదయ్య, పటాన్ చెరు - మల్లికార్జున్, ముషీరాబాద్ - దశరథ్ బరిలో దిగనున్నారని పేర్కొన్నారు.

అలాగే మూడు నినాదాలతో సీపీఎం పార్టీ ఎన్నికలకు వెళ్తుందని చెప్పారు.సీపీఎంకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఇవ్వాలని, సీపీఎంనే కాకుండా వామపక్షాలను బలాన్ని చేకూర్చాలని తెలంగాణ ప్రజానీకానికి పిలుపునిచ్చారు.

దేశాన్ని చిన్నాభిన్నం చేయడంతో పాటు మతోన్మాదాన్ని పెంచుతున్న బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు.

ఏంటి భయ్యా ఇది నిజమేనా? సానియా మీర్జా, షమీ పెళ్లిచేసుకున్నారా?