పోలవరం పరిశీలనకు సీపీఐ యాత్ర
TeluguStop.com

పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు యాత్ర చేపట్టామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు.


ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ప్రాజెక్టును సందర్శించడమే తప్ప పనులు మాత్రం జరగడం లేదని విమర్శించారు.


పోలవరం ఎత్తు తగ్గింపునకు లోపాయికారి ఒప్పందాలు జరుగుతున్నాయని ఆరోపించారు.ఈ మేరకు త్వరలోనే విజయవాడో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.
అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు పనుల జాప్యంపై కేంద్రమంత్రులను కూడా కలుస్తామని రామకృష్ణ తెలిపారు.
అనంతరం చంద్రబాబు పర్యటనపై స్పందించిన ఆయన ప్రశాంతంగా జరుగుతున్న ఆయన పర్యటనలు ఆపడం దారుణమని వ్యాఖ్యనించారు.
జీవో నెంబర్ .1పై అన్ని పార్టీలతో కలిసి ఛలో అసెంబ్లీ చేపడుతామని వెల్లడించారు.
సమ్మర్ స్పెషల్.. వెయిట్ లాస్ కు బెస్ట్ జ్యూస్ ఇది..!