రాష్ట్రపతి, గవర్నర్ వ్యవస్థపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
రాష్ట్రపతి, గవర్నర్ వ్యవస్థపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తక్షణమే రాష్ట్రపతి, గవర్నర్ వ్యవస్థలను రద్దు చేయాలన్నారు.ఈ రెండు వ్యవస్థలతో నష్టమే తప్ప లాభం లేదని విమర్శించారు.
గవర్నర్లతో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు.ఈ నేపథ్యంలోనే బెంగాల్, తమిళనాడు, కేరళలో గవర్నర్లతో కేంద్రం రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు.
గవర్నర్ రాజకీయ ఉపన్యాసాలు ఇస్తున్నారని తెలిపారు.మొత్తం గవర్నర్ వ్యవస్థ భ్రష్టు పట్టిందన్నారు.
గవర్నర్ లక్ష్మణ రేఖ దాటారని వ్యాఖ్యనించారు.యూనివర్సిటీ బిల్లులు ఆపే హక్కు గవర్నర్ కు ఎవరిచ్చారని ప్రశ్నించారు.
ఇష్టం లేకుంటే వెనక్కి పంపించాలి.కానీ పెండింగ్ లో పెట్టే హక్కు లేదని చెప్పారు.
గవర్నర్ తన హద్దును దాటితే గౌరవం ఉండదంటూ నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
CMR: గర్ల్స్ హాస్టల్‌లో రహస్యంగా 300 వీడియోలు రికార్డ్?