మెగా బ్రదర్స్ పై సీపీఐ నారాయణ సెటైర్లు..!!

సీపీఐ నారాయణ మెగా బ్రదర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.భీమవరం అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ వేదికపై తీసుకొచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు.

కానీ ఊసరవెల్లి లాగా ప్రవర్తించే చిరంజీవి సభా వేదికపై తీసుకురావడం సరైంది కాదని సెటైర్లు వేశారు.

ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలాగో ప్రవర్తిస్తాడో ఎవరికి తెలియదని ఎద్దేవా చేశారు.

ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి పై జనసేన చేపడుతున్న నిరసన కార్యక్రమాలను నారాయణ స్వాగతించడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిన ఎన్డీఏ .బలపరిచిన అభ్యర్థికి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీలు ఎందుకు మద్దతు తెలుపుతున్నాయి అని నిలదీశారు.బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నేతలు భయపడుతున్నారని సెటైర్లు వేశారు.

రాష్ట్రానికి రాజధాని విషయంలో అధికార పార్టీ వైసీపీకి చెత్త శుద్ధి లేదని సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఇక ఇదే సమయంలో వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని.ఈ క్రమంలో నష్టపోయిన వరద బాధితులకు ఇళ్లను నిర్మించాలని సిపిఐ నారాయణ తెలియజేశారు.

వృద్ధుడి కాలు కత్తిరించిన ఆస్ట్రేలియన్‌ అధికారులు.. ఎందుకో తెలిస్తే..