బీజేపీ, సీఎం జగన్ లపై సీపీఐ నారాయణ సీరియస్ వ్యాఖ్యలు..!!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో సార్వత్రిక ఎన్నికలు( General Elections ) జరగనున్నాయి.
ఈసారి ఎన్నికలలో పోటి వాతావరణం గట్టిగా ఉంది.దీంతో ప్రజల ఆదరణ పొందుకోవడానికి ప్రధాన పార్టీలు ప్రచారంలో రకరకాల హామీలు ప్రకటిస్తున్నారు.
ఏపీ 2024 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ( Ycp ) ఒంటరిగా పోటీ చేస్తుంది.
తెలుగుదేశం జనసేన కూటమిగా మీద పోటీ చేయబోతున్నాయి.జాతీయ పార్టీలు కాంగ్రెస్ మరియు బీజేపీ సింగల్ గా పోటీ చేయనున్నట్లు తాజా పరిణామాలు బట్టి తెలుస్తోంది.
ఇంకా 60 రోజులు మాత్రమే సమయం ఉండటంతో సీట్ల సర్దుబాటు.ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో పై పార్టీల అధినేతలు దృష్టి పెట్టడం జరిగింది.
"""/" /
ఈ క్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana )బీజేపీ, ఏపీ సీఎం జగన్ లపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
దేశంలో బీజేపీ అభివృద్ధి చేయకుండా రాముడిని అడ్డంపెట్టుకుని ఓట్లు దండుకోవాలని చూస్తుందని విమర్శించారు.
అంతేకాకుండా ఎన్నికల కోసమే ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ అని అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో జగన్.
మోదీ జపం చేస్తున్నారని మండి పడటం జరిగింది.ఆంధ్రులకు అన్యాయం జరుగుతుంటే జగన్ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు.
చెల్లెలు షర్మిల విమర్శలపై ఎందుకు సమాధానం చెప్పడం లేదు అంటూ సీపీఐ నారాయణ నిలదీశారు.
వింటర్ లో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడే పండ్లు ఇవే..!