అందుకే రైతు బిడ్డకు ప్రైజ్ మనీ ఇచ్చారు… మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ?

బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమం గురించి తరచూ సీపీఐ నారాయణ( Cpi Narayana ) సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.

ఈయన ప్రతి సీజన్లోనూ ఈ కార్యక్రమం గురించి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు.

అయితే తాజాగా ఈ సీజన్ పై కూడా ఈయన చేసినటువంటి కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే పూర్తి అయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద ఎత్తున ఉధృతి నెలకొన్న సంగతి మనకు తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ల కార్లపై దాడి చేయడం అలాగే ఆర్టీసీ బస్సులపై కూడా దాడి చేయడం జరిగింది.

"""/" / ఇలా ఆర్టీసీ బస్సులపై దాడి చేయడంతో ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా సీరియస్ అయ్యారు.

అయితే ఈ వ్యాఖ్యలపై నారాయణ స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.నేను గతంలో కూడా బిగ్ బాస్ కార్యక్రమం ఒక అరాచకమైనటువంటి షో అని సైబర్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సజ్జనార్ గారికి ఫిర్యాదు చేస్తే మూడు రోజుల తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళమన్నారు.

కింద కోర్టుకు వెళ్తే పై కోర్టుకు వెళ్ళమన్నారు.ఇలా పోలీసులు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోయారని నారాయణ తెలిపారు.

కొంతమందిని తీసుకెళ్లి ఆ హౌస్ లో పడేస్తారు.అందులో వారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతారని అది బిగ్ బాస్ హౌస్ కాదు వ్యభిచారి హౌస్ అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

"""/" / ఇకపోతే డబ్బుల కోసమే నాగార్జున ( Nagarjuna ) వంటి వారు ఇలాంటి కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తారంటూ కూడా ఈయన యాంకర్ పై ఫైర్ అయ్యారు.

ఇక ఈ సీజన్ గురించి కూడా మాట్లాడుతూ ఈ సీజన్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక యువకుడికి ట్రోఫీ అందజేసి ప్రైజ్ మనీ ఇచ్చారు.

అలా ఇవ్వడానికి కూడా బిగ్ బాస్ నిర్వాహకులు పెద్ద స్కెచ్ వేశారని ఈయన తెలిపారు.

ప్రస్తుతం పట్టణంలో ఉన్నటువంటి వారెవరు కూడా ఈ కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదు అందుకే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆడియన్స్ గా చేసుకోవడం కోసమే గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి రైతు బిడ్డకు ట్రోఫీ ఇచ్చి ప్రైజ్ మనీ ఇచ్చారు అంటు నారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

రైతు చేత వంద మొసళ్లను చంపించిన థాయ్‌లాండ్ ప్రభుత్వం.. ఎందుకంటే..