కొత్త మంత్రం చెప్తున్న నారాయణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక రకాలుగా అన్యాయం చేసిన భాజాపాతో పొత్తు( BJP ) పెట్టుకోవాలనే ఆలోచన నుంచి తెలుగుదేశం( TDP ) వెనక్కి రావాలంటూ సూచించారు కమ్యూనిస్టు పార్టీ నేత నారాయణ( Narayana ) భాజపా- వైసీపీలు పైకి ఎన్ని యుద్దాలు చేసినా వారు లివింగ్ రిలేషన్ లో ఉన్నారని బజాపా అవసరాలన్నీ వైసీపీ చక్కబెడుతుందని, పైకి వైసిపి పేరు మాత్రమే కనిపిస్తుందని లోపల కవర్ బీజేపీ దే అంటూ ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు.

స్వయంగా మోడీ శంకుస్థాపన చేసిన అమరావతికే దిక్కు లేకపోతే ప్రధాన స్థాయికి విలువ ఏమి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పట్ల అహంకార భావంతో వ్యవహరిస్తున్న మోడీ-వైసీపీ టీం కి చెక్ పెట్టాలంటే మరో కొత్త కూటమిని ప్రకటించాలని సిపిఐ, సిపిఎం,జనసేన పార్టీలతో కలిపి కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేయాలంటూ చంద్రబాబుకి( Chandrababu Naidu ) సూచించారు.

"""/" / పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతిలో మద్యం , మాంసం నిషేధం అంటారని కానీ టిటిడి పాలకమండల ని మద్యం వ్యాపారులతో నింపేస్తున్నారని దీనిని బట్టి టీటీడీ పట్ల వైసీపీకి ఎంత చిత్త శుద్ది ఉందో అర్థమవుతుందంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ఆంధ్రాలో జగన్( Jagan ) తెలంగాణలో కేసీఆర్( KCR ) బిజెపిని బూచిగా చూపి ఓట్లు దండుకోవడమే తప్ప లోపాయికారిగా ఈ రెండు పార్టీలు బిజెపికి మద్దతు అవసరమైనప్పుడల్లా మద్దతు ఇస్తున్నారని ఈ రాష్ట్రాలలో బిజెపి అధికారంలో లేకపోయినా తనకు కావాల్సింది చక్కబెట్టుకునే పరిస్థితి ఉందని.

"""/" / అందువల్ల తెలుగుదేశం తత్వాన్ని అర్థం చేసుకొని మిగతా పార్టీలతో జట్టు కట్టాలంటూ ఆయన చెప్పుకొచ్చారు.

దేశ రాజకీయాల్లో కూడా ఇండియా కూటమిని( INDIA Alliance ) పరిశీలించాలని తెలుగుదేశానికి ఆయన అల్టిమేటo జారీ చేశారు.

ఒకవైపు భాజపాతో పొత్తు కోసం తెలుగుదేశం తహతలాడుతూ అనేక ప్రయత్నాలు చేస్తుంది .

దొరికిన ప్రతీ అవకాశాన్ని చంద్రబాబు బిజేపి పెద్దల స్నేహం కోసం ఉపయోగించుకుంటున్నారు అలాంటప్పుడు కొత్త సమీకరణాలు సూచిస్తున్న నారాయణ మాటను ప్రతిపక్ష నేత ఎంతవరకు పట్టించుకుంటారో చూడాలి.

ఈ మ్యాజికల్ టానిక్ ను వాడితే వద్దన్నా మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది!