తెలంగాణ ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు శేషు కుమార్ మృతి పట్ల సిపిఎం నాయకులు సంతాపం
TeluguStop.com
ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సూరపనేని శేషు కుమార్ అకాల మృతి పట్ల సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లా విద్యారంగ అభివృద్ధికి, ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ లో కీలకం ఉండి పని చేసారని గుర్తుచేశారు.
వారు అకాల మరణం చెందడం బాధాకరమన్నారు.ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.
ఆయనకు సంతాపం, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.సంతాపం వ్యక్తం చేసిన తమ్మినేని, సుదర్శన్, యర్రా శ్రీకాంత్ సూరపనేని శేషుకుమార్ మృతి పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్‌లు సంతాపం వ్యక్తం చేశారు.
అసోసియేషన్ రాష్ట్ర నాయకుడి హోదాలో ప్రైవేట్ స్కూల్స్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంలో మరియు పరిష్కరింపచేయడంలో ఎంతో కృషి చేశారని, వారి మృతి తీరని లోటని అన్నారు.
వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
అభిమానికి మూడు లక్షల రూపాయల గిఫ్ట్ ఇచ్చిన చిరు.. అలా చేసి మెగాస్టార్ అనిపించుకున్నారుగా!