కొత్తగూడెం నుంచి పోటీ చేయనున్న సీపీఐ నేత కూనంనేని..!
TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం నుంచి పోటీకి దిగనున్నట్లు సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు తెలిపారు.


ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.బీఆర్ఎస్ కలిసి వస్తే కలుస్తాం.


లేదంటే పొత్తులపై ఆలోచిస్తామని వెల్లడించారు.కొత్తగూడెం, పాలేరు సిట్టింగ్ స్థానాల విషయం బీఆర్ఎస్ చూసుకుంటుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటు ఎన్నికల సమయానికి ఖరారు అవుతుందన్నారు.రానున్న ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం ఉమ్మడిగా కలిసి ముందుకు వెళ్తామని చెప్పారు.
అయితే ఎన్నికల సమయానికి పొత్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చని వెల్లడించారు.అదేవిధంగా పొత్తులపై కాంగ్రెస్ ఎటువంటి చర్చలు జరపలేదని స్పష్టం చేశారు.
20 ఏళ్లు గడుస్తున్నా జహీర్ ఖాన్ పై తగ్గని ప్రేమ.. వీడియో వైరల్