ఏపీలో వేసిన సిట్ వేస్ట్.. సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
ఏపీలో పోలింగ్ నేపథ్యంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై విచారణ నిమిత్తం వేసిన సిట్(SIT Investigation ) వేస్ట్ అని సీపీఐ నేత నారాయణ ( Narayana )అన్నారు.
సిట్ వలన ఎలాంటి ఉపయోగం లేదని తెలిపారు.ఏపీలో అరాచకాలు జరుగుతుంటే జగన్, చంద్రబాబు ( Jagan, Chandrababu )విదేశాలకు వెళ్లడం సరికాదని నారాయణ పేర్కొన్నారు.
రాష్ట్రంలో అల్లర్లపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా పోలింగ్ అనంతరం అల్లర్లపై జ్యుడీషియల్ విచారణ జరగాలన్నారు.
ఏపీలో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రత లేదన్న ఆయన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.
హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఆ వర్క్ కూడా చేశారా.. ఏమైందంటే?