కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ నేత నారాయణ విమర్శలు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీపీఐ నేత నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఉద్దేశ పూర్వకంగానే బీజేపీ మణిపూర్ లో అల్లర్లు సృష్టించిందని ఆయన ఆరోపించారు.

వామపక్షాలు సహా విపక్ష పార్టీలు అన్నీ కలిసి ఇండియా కూటమి ఏర్పడిందన్న నారాయణ ఇది బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తుందని స్పష్టం చేశారు.

అందుకే ఇండియా కనబడితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భయం పట్టుకుందని, ఈ క్రమంలోనే ఇండియా పేరును భారత్ గా మారుస్తున్నారని విమర్శించారు.

ఎటువంటి ఏజెండా లేకుండా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశారని మండిపడ్డారు.అదేవిధంగా కేంద్రం ప్రతిపాదిస్తున్న వన్ నేషన్ -వన్ ఎలక్షన్ సాధ్యం కాదని వెల్లడించారు.

సినిమాల విషయంలో దూకుడు పెంచుతున్న బాలయ్య…కారణం ఏంటి..?