బండి సంజయ్ కు సీపీఐ నేత కూనంనేని సవాల్
TeluguStop.com
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు సీపీఐ నేత కూనంనేని సవాల్ విసిరారు.
మునుగోడులో బీజేపీ ఓటమి పాలైతే బండి సంజయ్ రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు.లేని పక్షంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు.
ఒకవేళ మునుగోడు ఉపఎన్నికలో బీజేపీనే విజయం సాధిస్తే బండి సంజయ్ కు క్షమాపణలు చెప్తానని తెలిపారు.
సీపీఐ మద్ధతుతో మునుగోడులో టీఆర్ఎస్ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.అనంతరం ఫామ్ హౌజ్ ఘటనపై మాట్లాడుతూ మోదీ, అమిత్ షాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
హీరోయిన్ కీర్తి సురేష్ డ్రెస్ ఖరీదెంతో తెలుసా.. ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!