సూర్యాపేట జిల్లా: టిఎస్పిఎస్సి ప్రశ్నాపత్రం లీకేజీపై సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించి, నిరుద్యోగులకు న్యాయం చేయాలని సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్ డిమాండ్ చేశారు.
శనివారం జిల్లా కేంద్రంలో టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీపై విచారణ జరిపాలని మంత్రి ఇంటి ముందు ప్రజా పంథా ఆధ్వర్యంలో ధర్నాకు రావడంతో వారిని మధ్యలోనే పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ అక్రమ అరెస్టులను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు.
కోటి ఆశలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందని యువత ఎన్నో కలలుగన్నదని,అలాంటిది తొమ్మిది సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తే కొంతమందికైనా ఉద్యోగాలు వస్తాయని యువత సంతోషంగా గ్రూప్ వన్ ప్రిలిమినరీ రాసి 25 వేల మంది క్వాలిఫై అయ్యారని,ఆ తర్వాత పేపర్ లీకేజీ పేరుతోటి బీఆర్ఎస్,బీజేపీ తిట్టుకుంటూ రాజకీయ డ్రామాలతో ఉద్యోగాలు ఇవ్వలేక నిరుద్యోగులను మోసం చేస్తూ కాలం గడుపుతున్నారని విమర్శించారు.
వీరి ఆటలు కట్టిపెట్టి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి అసలైన నేరస్తులను కఠినంగా శిక్షించాలని,అదేవిధంగా దీనికి కారణమైన అధికార పార్టీ మంత్రులు రాజీనామా చేయాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చి టీఎస్పీఎస్సీలో క్వాలిఫై అయిన వారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మంత్రికి వినతిపత్రం ఇవ్వాలని బయలుదేరుతుంటే పోలీసులు మధ్యలో అడ్డుకొని అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యని అన్నారు.
మహిళా కానిస్టేబుల్ లేకుండా మహిళలను అరెస్టు చేయడానికి ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు.
ఈ అక్రమ అరెస్టులకు భయపడేది లేదని నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు.
అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు.అరెస్టు అయిన వారిలో పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ, జయమ్మ,ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రామోజీ,ప్రజా పంథా పట్టణ కార్యదర్శి గులాం,సంతోషి,పి.
డి.ఎస్ యు నాయకులు పుల్లూరు సింహాద్రి,పి వై ఎల్ జిల్లా నాయకులు గోగుల వీరబాబు వాజీదు,నగేష్ తదితరులు ఉన్నారు.
ఇదేం విచిత్రం.. ఇన్‌ఫ్లుయెన్సర్ ఫొటోలు కటౌట్లుగా అమ్మకం.. ఆమెకు తెలిసి మైండ్ బ్లాక్!