రాజన్న గోవుల గోసాలు ఎన్నడూ తీరేను..
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో అత్యంత ముఖ్యమైన మొక్కు రాజన్న కోడె మొక్కు కోడే ని కట్టంగ కొంగు బంగారం ఇచ్చు రాజన్న భక్తులు విశ్వసిస్తారు ఇలా ప్రతి ఏటా కొన్ని వందల సంఖ్య దాటుతూ వేలకు పైగా కొడెలను, ఆవు లను భక్తులు సమర్పిస్తారు.
సమర్పించే ప్రతి కోడెకు రక్షణ లేదు రాజన్న దేవస్థానంలో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగు కనిపిస్తూనే ఉంటుంది పేరుకు మాత్రం గోవులకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని చెబుతూ వస్తున్నారు నెలలో కేవలం 15 రోజులు మాత్రమే పచ్చగడ్డి వేస్తూ అది కూడా పూర్తిస్థాయిలో అందించకపోవడం వల్ల విఫలమవుతున్న కాంట్రాక్టర్ పచ్చ గడ్డి తెచ్చే కాంట్రాక్టర్ రైతా కాదా అని ఆలోచించే పరిస్థితిలో లేని అధికార యంత్రాంగం .
వేములవాడలో రెండు గోశాలలు ఉన్నా మరికొన్ని గోవులు ఎక్కువ రోడ్లమీద బ్రిడ్జి పైన, గుడికి వెళ్లే దారిలో, కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాల్లో పాడపోయిన కూరగాయలు తింటూ దారిలో గాలికి వదిలేసిన వైనం మరి ఈ గోవులకు రక్షణ ఏది 300 కోవులకు రక్షణ కల్పిస్తున్న అధికారులు 80 ఆవులకు మేత వేస్తున్నామని చెప్పి అధికారులు మరి ఈ రోడ్లపై విడిచిపెట్టిన గోవులకు ఇంకెన్ని రోజులు.
నీడను వెతుక్కుంటాయి ఈ గోవులు తెలంగాణ గోశాల ఫెడరేషన్ ద్వారా మిగతా జిల్లాలకు గోశాలలకు తరలిస్తారు.
కానీ అవి పూర్తి ఆరోగ్యంగా ఉంటేనే తరలిస్తారు అనారోగ్యంగా ఉన్న ఆవులు ,సొమ్మసిల్లిపోయే కోడెలు రోడ్లమీద వదిలేస్తారు.
ఇలా వదిలేసిన ఆవులకు ఎలాంటి రక్షణ లేదు ఎవరు ఎత్తుకెళ్లినా.అడిగి నాధుడే లెడు రోడ్లమీద వదిలేసినావులే వందల సంఖ్యలో వందకు పైగా ఉండేవి ఇప్పుడు తగ్గు ముఖం పట్టాయి వదిలేసిన ఆవులు ఎక్కడికి పోతున్నాయి ఎలా బ్రతుకుతున్నాయి ఎవరికి అక్కరలేదు రోడ్డుమీద ఉన్న దుకాణం దారులు , గుడికి వచ్చే భక్తులు వీటికి ఆహారం పంచేది.
కానీ కొన్ని సమయాల్లో ఆహారం పూర్తిగా లభించగా చనిపోతున్నాయి తింటూ ప్లాస్టిక్ తింటూ మరికొన్ని చనిపోతున్నాయి ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమే అంటూ ప్రజలు చెప్తున్నారు.
అధికారులు బయట వదిలేసిన ఆవులపై దృష్టి పెట్టాలని ఇప్పటికైనా వాటికి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
ఏ మతం ఇలాంటి హింస కోరదు.. కెనడాలో హిందువులపై దాడిపై సిక్కు వ్యాపారవేత్త ఆవేదన