ఈ వరాహం సాక్షాత్తు విష్ణువు రూపమేనా.. ఆనందంగా పాలిచ్చిన గోమాత..?
TeluguStop.com
నిత్యం సోషల్ మీడియా(
Social Media )లో అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.
వైరల్ అవుతున్న వీడియోలలో జంతువులకు సంబంధించిన వీడియోలు కొన్ని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి.
అచ్చం అలాంటి సంఘటన నేడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
ఒక గోమాత విశ్రాంతి తీసుకునే సమయంలో ఆకలితో ఇబ్బంది పడుతున్న ఒక పిల్ల వరాహం ఎటువంటి భయం లేకుండా గోమాత దగ్గరకు వెళ్లి పాలు తాగింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు పడుతుంది.
"""/" / ఈ సంఘటన ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా( Srikakulam )లో చోటుచేసుకుంది.
శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నంలో రామ మందిరం సమీపంలో ఒక గోమాత విశ్రాంతి తీసుకుంటుంది.
"""/" /
ఈ క్రమంలో ఆకలితో ఇబ్బంది పడుతున్న ఒక పంది పిల్ల గోమాత వద్దకు వెళ్లి తన తల్లిలాగే భావించి పాలు తాగేసింది.
ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఆకలికి జాతి భేదం ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇలాంటి సందర్భాల్లో చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి.ఇదివరకు కూడా ఓ శునకం పంది పిల్లలకు ఇలా పాలు ఇవ్వడం లాంటి సంఘటనలు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
నేను మీసం తిప్పితే ఓట్లు పడతాయా ? క్లాస్ పీకిన పవన్