పశు వైద్యశాల సిబ్బంది నిర్లక్ష్యంతో ఆవు, దూడ మృతి..

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని అన్నపూర్ణేశ్వరి ఆశ్రమంలో ఓ ఆవు ప్రసవ వేదనతో బాధపడుతుంటే ఆశ్రమ సిబ్బంది స్థానిక పశు వైద్య శాల డాక్టర్ కు సమాచారం అందించారు.

అందుబాటులో లేని డాక్టర్ కాంపౌండర్ ను పంపగా కడుపులో ఉన్న దూడ కదలికలు వేరేలా ఉన్నాయని, నల్లగొండ తీసుకెళ్లాలని ఉచిత సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు.

కాసేపటి తర్వాత ఆవు, దూడ మృతి చెందాయి.బుధవారం ఆశ్రమ ప్రాంగణంలో ఆవుకు అంతక్రియలు జరిపారు.

దీనికి పశువుల డాక్టర్, కాంపౌండర్ నిర్లక్ష్యమే కారణమని ఆశ్రమ నిర్వాహకులు, రైతులు ఆరోపించారు.

మండలానికి చెందిన పశువులకు వైద్యం చేయడానికి డాక్టర్లు అందుబాటులో లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, సరైన వైద్యం చేయరాని పశు వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఫ్లాప్ హీరోయిన్ కు మరో ఛాన్స్.. అల్లరోడు అయినా ఈ బ్యూటీకి హిట్ ఇస్తారా?