కోవిడ్ సోకి మెట్లపై శవంగా తేలిన భారతీయుడు.. దర్యాప్తులో ఆసక్తికర విషయాలు

కోవిడ్ సోకి మెట్లపై శవంగా తేలిన భారతీయుడు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు

ఈ ఏడాది ఏప్రిల్‌లో కోవిడ్ వైరస్ సోకి సింగపూర్‌లోని ఓ ఆసుపత్రి మెట్ల వద్ద శవమై కనిపించిన భారతీయుడి మరణానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కోవిడ్ సోకి మెట్లపై శవంగా తేలిన భారతీయుడు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు

పాజిటివ్‌గా తేలిన తర్వాత అతను తన ఆర్ధిక పరిస్ధితి, కుటుంబం గురించి తీవ్రంగా మదనపడినట్లుగా తెలుస్తోంది.

కోవిడ్ సోకి మెట్లపై శవంగా తేలిన భారతీయుడు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు

46 ఏళ్ల అలగు పెరియకరుప్పన్ ఏప్రిల్ 23న కేటీపీహెచ్ మూడో అంతస్తు సమీపంలో ఉన్న మెట్ల వద్ద విగతజీవిగా పడివున్నట్లు ఓ వైద్యుడు వెల్లడించాడు.

అంతకు కొద్దిరోజుల ముందు అతను పాజిటివ్‌గా తేలడంతో అదే ఆసుపత్రిలో చేరాడు.ఏప్రిల్ 19న ఆసుపత్రిలో చేరిన ఆయన ఎవరితోనూ మాట్లాడేవారు కాదని, అయితే భోజన వేళ్లల్లో మాత్రం అలగు ఇతర రోగులకు భోజనం ప్లేట్లు అందించడంలో సాయపడేవారని వైద్యులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

పెరియకరుప్పన్ భారత్‌లోని తన పిల్లలతో పాటు కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యల గురించి బాధపడేవాడని కేటీపీహెచ్‌లోని మానసిక వైద్య విభాగానికి అధిపతి డాక్టర్ గోహ్ కాహ్ హంగ్ అన్నారు.

అలాగే తమ ఆసుపత్రిలో కోవిడ్ రోగులుగా వున్న వారిలో చాలా మంది వలస కార్మికులేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో అలగుకు ఇతర అనారోగ్య సమస్యలు లేకపోవడం వల్ల కమ్యూనిటీ ఫెసిలిటీకి తరలించాలని వైద్యులు భావించారు.

అయితే ఏప్రిల్ 23 తెల్లవారుజామున 5.30 గంటలకు, తన వార్డులో వున్న టాయిలెట్‌లో అతను రెండు వీడియోలు తీసుకున్నట్లు తేలింది.

తనకు కరోనా సోకినందున జీవితాన్ని ఇక ముగించాలని అనుకుంటున్నట్లు సదరు వీడియోలలో పెరియకరుప్పన్ తెలియజేశాడు.

అతను చాలా ఎత్తు నుంచి కిందపడిపోవడం వలన సంభవించిన గాయాలతో మరణించాడని పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది.

గుండె చీలిపోవడం, పక్కటెముకలు, కటివలయాలు, మెదడు పై భాగంలో రక్తస్రావం సహా అనేక గాయాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

అతని మరణం కేవలం న్యూమోనియా వల్ల జరిగిందని సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవని డాక్టర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఈ ఘటన జరిగిన నాటి నుంచి కేటీపీహెచ్ ఆసుపత్రి వర్గాలు రోగుల వార్డుల్లో భద్రతా చర్యలు చేపట్టాయి.

కాగా సెప్టెంబర్ 2009 నుంచి పెరియకరుప్పన్ సింగపూర్‌లో భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేస్తున్నాడు.

పారడైజ్ సినిమాతో ఆ రికార్డ్ క్రియేట్ చేయబోతున్న న్యాచురల్ స్టార్.. ఏమైందంటే?