రాహుల్ గాంధీ జోడోయాత్ర చుట్టూ కోవిడ్ పాలిటిక్స్
TeluguStop.com

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రపై కోవిడ్ పాలిటిక్స్ ప్రభావాన్ని చూపిస్తున్నాయి.


కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జోడో యాత్రలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం లేఖ రాసిన విషయం తెలిసిందే.


కరోనా నిబంధనలు పాటించకపోతే జోడోయాత్ర నిలిపివేయాలని పేర్కొంది.కేంద్రం లేఖపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.
ఈ క్రమంలోనే దేశంలో అత్యవసర ఆరోగ్య పరిస్థితిని ప్రకటించారా అంటూ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఫైర్ అయ్యారు.
ఈ నిబంధనలు మోదీకి, బీజేపీ నేతలకు కూడా వర్తిస్తాయా అంటూ ప్రశ్నలు సంధించారు.
జాతీయస్థాయిలో లాక్ డౌన్ విధించే పరిస్థితులు ఉన్నాయా అంటూ విమర్శించారు.ఈ ప్రశ్నలన్నింటికీ కేంద్ర ఆరోగ్యమంత్రి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
జనరేటర్ లో అందుకే చక్కెర వేసాము…. సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు విష్ణు!