ఇప్పుడు ఇండియాలో విషాదం.. వైరస్ ఎక్కడున్నా ప్రపంచానికే ముప్పే: డాక్టర్ వివేక్ మూర్తి
TeluguStop.com
ప్రపంచంలోని ఏ ప్రాంతంలో వైరస్ వున్నా.అంతిమంతగా అది ప్రతి దేశానికి ముప్పేనన్నారు భారత సంతతికి చెందిన అమెరికా సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి.
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.భారత్‌లో ప్రస్తుత రెండో దశ విషాదకరమని వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశాలు పరస్పర సహకారంతో మహమ్మారిని తరిమి కొట్టాల్సిన అవసరం వుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం అన్ని దేశాలకు టీకాలు సరఫరా అవుతున్నాయని.అలాగే అత్యవసర వైద్య సామాగ్రిని కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలని మూర్తి సూచించారు.
కొత్త వేరియెంట్లతో భారత్ ఇప్పుడు సవాళ్లను ఎదుర్కొంటోందని.మొదటి దశలో అమెరికాలో నెలకొన్న దారుణాల కంటే 50 శాతం అధిక తీవ్రత అక్కడ వుందని వివేక్ మూర్తి చెప్పారు.
ప్రస్తుతం బీ117 రకం ప్రభావం తీవ్రంగా వుందని.ఇదే సమయంలో మరో రకం 617పై పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు.
వైరస్ వ్యాప్తి తగ్గితేనే.అవి మ్యూటేషన్ కావడం ఆగుతుందని వివేక్ మూర్తి తెలిపారు.
అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని ఆయన వెల్లడించారు.కాగా, అమెరికా సర్జన్ జనరల్‌గా డాక్టర్ వివేక్ మూర్తిని నియమిస్తూ అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయానికి అమెరికా సెనేట్ మార్చిలో ఆమోదం తెలిపింది.
అధికారం చేపడూనే వివేక్ మూర్తిని సర్జన్ జనరల్‌గా నామినేట్ చేశారు బైడెన్.దీంతో ఈ నియామకానికి సంబంధించి మంగళవారం సెనేట్‌లో ఓటింగ్ నిర్వహించారు.
దీనిలో భాగంగా 57 మంది సెనేటర్లు వివేక్ మూర్తికి అనుకూలంగా ఓటు వేయగా, 43 మంది సెనేటర్లు వ్యతిరేకించారు.
రిపబ్లికన్ పార్టీకి చెందిన ఏడుగురు సెనేటర్లు బిల్ కాసిడీ, సుసాన్ కొలిన్స్, రోజర్ మార్షల్, లిసా ముర్కోవిస్కి, రాబ్ పోర్ట్మన్, మిట్ రోమ్నీ, డాన్ సుల్లివన్ డాక్టర్ మూర్తికి అనుకూలంగా ఓటు వేయడం విశేషం.
అమెరికన్లను కోవిడ్ చావు దెబ్బ కొట్టిందని.దేశంలో ఐదు లక్షలకు పైగా మందిని వైరస్ బలిగొందని.
అందులో తన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సర్జన్ జనరల్‌గా ఈ వైరస్‌ను అంతమొందించడమే తన తొలి ప్రాధాన్యమని వివేక్ మూర్తి వెల్లడించారు.
"""/"/
బ్రిటన్‌లో జన్మించిన వివేక్ మూర్తి అమెరికాలో పెరిగారు.హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బీఏ, యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.
అనంతరం యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ఎండీ చేశారు.43 ఏళ్ల డాక్టర్ మూర్తి .
అమెరికా సర్జన్ జనరల్ పదవిని చేపట్టడం ఇది రెండవసారి.2011లోనూ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వ సమయంలో వివేక్ మూర్తి .
హెల్త్ అడ్వైజర్‌గా పని చేశారు.
ఈ మ్యాజికల్ డ్రింక్ తో మీ బాన పొట్ట ఐస్ కంటే వేగంగా కరుగుతుంది!