ఆ దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఆక్సిజ‌న్ కోసం జ‌నం ఆరాటం.. ?

కరోనా కారణంగా ప్రపంచం అనుభవించిన బాధలు చూస్తే ఇలాంటి కష్టాలా చూడడానికి ఇంకా బ్రతికామని అనుకోని వారుండరు.

ఆకలి కేకలు, అయిన వారి చీదరింపులు.ఇలా ఎవరికి ఎవరిని కాకుండా చేసిన కోవిడ్ 19 చరిత్రలో మరచిపోని స్దానాన్ని సంపాధించింది.

అయితే ప్రస్తుతం ఈ వైరస్ నుండి ప్రజలు కోలుకుంటున్న విషయం తెలిసిందే.కానీ పేరు దేశంలో మాత్రం ఇప్పటికి ఈ వైరస్ బాధను అక్కడి ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు.

ఈ దేశంలో సెకండ్ వేవ్ కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో ఇక్కడి ప్రజలు ఆక్సిజ‌న్ కోసం జ‌నం ప‌డిగాపులు కాస్తున్నారట.

ముఖ్యంగా తీవ్ర శ్వాస కోస వ్యాధులతో ఉన్న‌వారి ప్రాణాలు కాపాడే సంజీవినిగా ఆక్సిజ‌న్ త‌ప్ప‌నిస‌రి అయ్యింది.

దీంతో ఇక్కడి ప్రజలు ఆక్సిజ‌న్ కోసం లిమా స‌మీపంలో ఉన్న ఓ ఆక్సిజ‌న్ ఫ్యాక్ట‌రీ వ‌ద్ద రాత్రి అనక పగలనక పడిగాపులు కాస్తున్నారట.

సిలిండ‌ర్ల‌పై తమ పేర్ల‌ను రాసి మ‌రీ వెయిటింగ్‌లో ఉంటుండటంతో, భారీ క్యూలైన్లు ఏర్పడ్డాయట.

ఇకపోతే ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల ధ‌ర‌ను మాత్రం పెంచ‌లేదని ఓ అధికారి తెలపడం విశేషం.

ఇక మనదేశంలో అయితే కరోనా సమయంలో పాల ప్యాకెట్స్ ధరను పెంచి అమ్ముకున్న ఘనులు ఉన్నారు.

ఎవరికి ఓటు వేయాలో ప్రజలే తేల్చుకోవాలి..: సీఎం జగన్