కరోనా పేరుతో 2వేల కోట్లు నొక్కేశారట.. ఎక్కడంటే?

కరోనా వైరస్.ప్రపంచ దేశాలను వణికించేస్తున్న సంగతి తెలిసిందే.

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కోటి 56 లక్షలమందికి వ్యాపించింది.

95 లక్షలమంది కరోనా వైరస్ నుండి కోలుకోగా 6 లక్షలమందికిపైగా కరోనా వైరస్ కి బలయ్యారు.

ఇది ఇలా ఉండగా.భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఘోరంగా ఉంది.

కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే.

దాదాపు అన్ని రాష్ట్రాలు కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ మొత్తం సంక్షోభంలో కూరుకుపోతుంది.

ఇలాంటి సమయంలో కర్ణాటక ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేశారు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య.

"""/"/ సిద్ధరామయ్య మాట్లాడుతూ.కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప సహా క్యాబినెట్ లోని మంత్రులు అందరూ కూడా ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్నారని కరోనా పేరు అడ్డు పెట్టుకుని ఏకంగా రెండు వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారు అంటూ అయన ఆరోపించారు.

హైకోర్టులో దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన సిద్దరామయ్య అసెంబ్లీ లో సైతం దీనిపై చర్చ జరగాలని కోరారు.

కాగా కరోనా వైరస్ కట్టడిలో యడ్యూరప్ప ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు చేశారు.

న్యాచురల్ స్టార్ నానికి జోడీగా ఎన్టీఆర్, చరణ్ బ్యూటీ.. ఈ హీరోయిన్ దశ తిరిగిపోతుందిగా!