టిక్ టాక్ వీడియో చేసిన కరోనా పేషెంట్! అధికారులు సీరియస్

ఈ మధ్య కాలంలో టిక్ టాక్ సోషల్ మీడియా మూవీ యాప్ ఎంతగా పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే.

దీని ద్వారా చాలా మంది తమ టాలెంట్ చూపించుకుంటూ ఉండగా, మరికొంత మంది పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ ఫేమస్ అయిపోతున్నారు.

ఓ విధంగా చెప్పాలంటే అమ్మాయిలకి టిక్ టాక్ ఒక వ్యసనం క్రింద మారిపోయింది.

సమయం, సందర్భం లేకుండా టిక్ టాక్ వీడియోలు చేస్తున్నారు.తాజాగా కరోనా సోకినా ఓ యువతీ హాస్పిటల్ లో బెడ్ మీద ఉండకుండా అక్కడ ఉద్యోగులకి మస్కా కొట్టి వారితో కలిసి టిక్ టాక్ వీడియో చేసింది.

ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు రంగంలోకి దిగి సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.

తమిళనాడులోని అరియలూరు ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువతి వేలాచేరిలోని ప్రముఖ ఫినిక్స్ మాల్ లో ఉద్యోగం చేస్తుంది.

ఈమె మార్చి 24వ తేదీ చెన్నై నుంచి తిరిగి వచ్చింది.చెన్నై నుంచి వచ్చిన యువతికి జ్వరం ఎక్కవగా ఉండటంతో ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించారు.

అందులో ఆమెకి పాజిటివ్ రావడంతో అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ మహిళా వార్డుకు తరలించారు.

ఆమెకి చాలాకాలంగా టిక్ టాక్ వీడియోలు చేసే అలవాటు ఉండటంతో హాస్పిటల్ లో సైలెంట్ గా ఉండలేకపోయింది.

హాస్పిటల్ లో అపారిశుద్ద కార్మికులకి మాయమాటలు చెప్పి టిక్ టాక్ వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

ఆ టిక్ టాక్ వీడియోలను చూసిన నెటిజన్లు అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రి సీనియర్ వైద్యులకు సమాచారం ఇచ్చారు.

దీనితో వెంటనే స్పందించిన వైద్యులు ముగ్గురు సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో పాటు వారికి కూడా కరోనా పరీక్షలు చేసారు.

వారికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని తెలియజేశారు.

ఇదేంది భయ్యా.. కేవలం 10 మీటర్లు దూరం సైకిల్ తొక్కితే రూ. పదివేల బహుమతి.. కాకపోతే కండిషన్స్ అప్లై..