వాళ్ళు రోజూ కోట్లలలో లాభాలు దండుకుని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదుగా…  

ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థలు అయినటువంటి ఫ్లిప్ కార్ట్, అమెజాన్, జుమోటో, స్విగ్గి, మెక్ డొనాల్స్, ఈబే, తదితర కంపెనీలు రోజు వినియోగదారులకు సర్వీసులను అందిస్తూ బాగానే లాభాలను ఆర్జిస్తున్నారు.

అయితే గత కొద్ది కాలంగా కరోనా వైరస్ మహమ్మారిని తరిమికోట్టేందుకు  దేశంలోని ప్రముఖులు మరియు సెలబ్రెటీలు వ్యాపారవేత్తలు ఇలా ఎందరో తమకు తోచినంత విరాళాన్ని దేశ ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వాలకి సహాయం చేస్తున్నారు.

కానీ ఈ ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థలు మాత్రం తమ ఖాతాలో నుంచి ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు కరోనా వైరస్ సహాయనిధ లకు అందించలేదు.

దీంతో దేశవ్యాప్తంగా ఈ విషయం గూర్చి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.అంతేకాక ఎక్కడో ఇతర దేశాల నుంచి వచ్చి లాభాలను గడిస్తూ విపత్కర సమయంలో ప్రజలకు అండగా నిలబడకుండా వచ్చిన లాభంతో తమ జేబులు నింపుకునేటువంటి మార్కెటింగ్ సంస్థలను నిషేధించాలంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అంతేగాక దేశంలో కరోనా వైరస్ సహాయ నిధులకు చిన్నపాటి కూలీల నుంచి పెద్దపెద్ద వ్యాపార వేత్తలు సైతం విరాళాలు అందిస్తున్న సమయంలో లాక్ డౌన్ సమయంలో కూడా యధావిధిగా తమ సర్వీసులను అందిస్తూ లాభాలు గడిస్తున్నటువంటి జుమోటో, స్విగ్గీ, తదితర సంస్థల సేవలను ఉపయోగించుకో వద్దంటూ కొందరు ప్రజలకు సూచిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టాలని ఇప్పటివరకూ దేశ మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు భారతదేశపు అపర కుబేరుడు ముఖేష్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా, అజీమ్ ప్రేమ్ జీ, అలాగే పలువురు సినీ సెలబ్రిటీలు కోట్లలో విరాళాలు అందించారు.

దీంతో దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థలను బహిష్కరించాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 .

కాంగ్రెస్ వి ఓటు బ్యాంకు రాజకీయాలు..: జేపీ నడ్డా