వరుసకి అక్కాచెల్లెళ్లు... కాని పెళ్లి చేసుకొని ఒకటయ్యారు! విచిత్ర బంధం

ఈ మధ్య కాలంలో తరుచుగా స్వలింగ సంపర్కుల వివాహాలు చూస్తున్నాం.సుప్రీం కోర్ట్ కూడా వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్వలింగ జాతులు అందరూ ధైర్యంగా ముందుకొచ్చి పెళ్ళిళ్ళు చేసుకోవడంతో పాటు, తాము స్వలింగ సంపర్కులం అనే విషయాన్ని కూడా బహిరంగంగా ప్రకటిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా స్వలింగ సంపర్కం కలిగి ఉన్న ఇద్దరు అమ్మాయిలు లేచి పోయి వెళ్లి ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు.

అయితే ఇలా పెళ్లి చేసుకోవడంలో పెద్ద ఆశ్చర్యం లేకపోయిన కూడా వారు ఇద్దరు వరుసకి అక్క చెల్లి కావడమే ఇప్పుడు ఆసక్తికర విషయంగా మారింది.

ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్ కి చెందిన అక్కా చెల్లెలు అయ్యే ఇద్దరు యువతులు స్వలింగ వివాహం చేసుకున్నారు.

ఆ వివాహానికి సంబంధించిన ఫోటలోను వారు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

వీరు కుటుంబ ఇద్దరు వివాహం చేసుకోవాలని వారణసికి సమీపంగా ఉన్న రోహానియా ప్రాంతంలోని శివాలయంకి వెళ్లారు.

వీరు ఆ శివాలయం వెళ్లేటప్పుడు ఎవరికి అనుమానం రాకుడదని ముఖాలకి స్కార్ఫ్ కట్టుకున్నారు.

తమకి వివాహం జరిపించాలని శివాలయం పూజారిని కోరారు.వీరి వివాహం జరిపించడానికి పూజారి ముందుగా నిరాకరించిన తరువాత భీష్మించుకొని కూర్చోవడంతో తప్పని సరి పరిస్థితిలో వివాహం చేసారు.

అయితే అసలే ఆచార విరుద్ధంగా జరిగిన వివాహం అని అనుకుంటే, దానికి తోడు వావి వరుసలు లేకుండా జరిగిన ఈ పెళ్లి వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

రూ.1000తో బాలిలో ఏం దొరుకుతుందో తెలుసా.. తెలిస్తే షాక్ అవుతారు..