సమంత కేసు విషయంలో షాక్ ఇచ్చిన కోర్టు... అందరూ సమానమే అంటూ...

గత కొద్దిరోజులుగా టాలీవుడ్ టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్ సమంత మరియు ఆమె భర్త నాగచైతన్యల విడాకుల విషయం హల్ చల్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

దీంతో ఇటీవలే సమంత తన భర్త అక్కినేని నాగ చైతన్య తో విడాకులు తీసుకుంది.

ఈ విషయాన్ని అక్కినేని నాగ చైతన్య మరియు సమంత అధికారికంగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన అభిమానులకు కూడా తెలియజేశారు.

అయితే ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో సినీ సెలబ్రిటీల గురించి ఏదైనా ఓ వార్త బయటకు పొక్కిందంటే నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు చేసేటువంటి ప్రచారాల కారణంగా సినీ సెలబ్రిటీలు ఇబ్బందులకు గురవుతున్నారు.

దీంతో సమంత విషయంలో కూడా అదే జరిగింది.అయితే సమంత విడాకులు తీసుకోబోతున్నట్లు విడాకులు తీసుకునే కొద్ది రోజుల ముందు బయటికి తెలియడంతో పలు యూట్యూబ్ చానళ్లు మరియు వార్త వెబ్ వెబ్ సైట్లు వ్యూస్ కోసం నిజానిజాలు తెలుసుకోకుండా అసత్య కథనాలను మరియు మనోభావాలను దెబ్బతినే విధంగా తప్పుడు కథనాలు ప్రచురించారు.

దీంతో హీరోయిన్ సమంత ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన గురించి నిజానిజాలు తెలుసుకోకుండా ఆసత్య కథనాలు ప్రచురించిన యూట్యూబ్ చానళ్లు మరియు వార్త వెబ్ వెబ్ సైట్ల పై కేసులు నమోదు చేసి పరువు నష్టం దావా కూడా వేసింది.

"""/"/ దీంతో ఈ రోజు కేసు కోర్టు హియరింగ్ కి వచ్చింది.ఈ క్రమంలో సమంత తరుపున వాదించేటువంటి న్యాయవాది కొంతమేర తొందర పెట్టడంతో కోర్టువారు న్యాయ దేవత ముందు సినీ సెలబ్రిటీలైనా, సామాన్యులైనా మరియు ఇతర రాజకీయ నాయకులు ఎవరైనా సరే అందరూ సమానమే అంటూ హెచ్చరించింది.

ఆ తర్వాత న్యాయవాది సమంత గురించి అసత్య కథనాలు ప్రచురించిన వారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వాదించాడు.

అంతేకాకుండా ఆమె కోరినంత పరువు నష్టం దావా ఇప్పించాలని కూడా కోర్టు వారికి తెలియ జేశాడు.

దీంతో ఇరువురి వాదోపవాదాలు విన్న తర్వాత క ఈ కేసుని మరింత క్షుణ్ణంగా విచారించి వివరాలను తెలియజేయాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది.

దీంతో ఈ విషయంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఈ మధ్య కాలంలో కొందరు రు సోషల్ మీడియా మాధ్యమాలలో సెలబ్రిటీల గురించి అసత్య కథనాలు మరియు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ పాపులర్ కావాలని చూస్తున్నారని ఈ క్రమంలో సెలెబ్రెటీల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా నిజానిజాలు తెలుసుకోకుండా తమ గురించి తప్పుడు కథనాలను ప్రచారం చేసే వారిపై సమంత సరైన నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో చూడాలి.

సీతా రామం సినిమా తర్వాత మృణాల్ ఎందుకు బిజీ అవ్వలేదు?