జెడ్పీటీసీ ఎన్నికపై కోర్టు తీర్పు బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు:మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్

నల్లగొండ జిల్లా:2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో చందంపేట టీఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి వయస్సు రీత్యా తప్పుడు ధ్రువపత్రాలతో ఎన్నికల నిబంధనలను ఉల్లంగించి, అధికారులను,మండల ప్రజలను మోసం చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని,ఆమె ఎన్నిక చెల్లదని న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగిందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు.

శుక్రవారం దేవరకొండ పట్టణంలో జేఎన్ఆర్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి నేనావత్ బుజ్జి లచ్చిరాం నాయక్ సరైన ఆధారాలతో జిల్లా న్యాయ స్థానాన్ని ఆశ్రయించడంతో 2023 మార్చి15 న టీఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి ఎన్నిక చెల్లనేరదని రెండవ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేనావత్ బుజ్జి లచ్చిరాం నాయక్ ని చందంపేట జెడ్పీటీసీగా ఎన్నిక చేస్తూ పదవి బాధ్యతలు స్వీరించాలని నల్లగొండ జిల్లా సీనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీ తేజో కార్తీక్ తన తీర్పులో వెల్లడించారని తెలిపారు.

పిటిషనర్ బుజ్జి లచ్చిరాం నాయక్ తరుపున సీనియర్ న్యాయవాది లింగంపల్లి శ్రీనివాస్ కేసును వాదించారన్నారు.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?