చిలుక వాంగ్మూలంతో కొలిక్కి వచ్చిన హత్య కేసు.. నిందితులకు ఏం శిక్ష పడిందంటే..?

గతంలో 9 సంవత్సరాల కిందట జరిగిన ఓ హత్య కేసులో ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా ఒక్క క్లూ కూడా దొరకక పోలీసులు తల పట్టుకున్న సమయంలో ఒక చిలుక వాంగ్మూలంతో పోలీసులు నిజాన్ని రాబట్టి కేసును కొలిక్కి తెచ్చి కోర్టు ముందు హాజరు పరిచారు.

ఆధారాలు పక్కాగా ఉండడంతో నిందితులకు జీవిత ఖైదు పడింది.కోర్టులో సాక్ష్యం మనుషులదే చెల్లుతుంది.

జంతువులు, పక్షుల వాంగ్మూలం చెల్లదు.ఒకవేళ చెల్లిన కూడా అవి నిందితులను ఎలా పట్టి ఇవ్వగలదు.

వీళ్లే నిందితులు అని ఎలా నిరూపించగలవు అనే అనుమానాలు ఈ విషయం తెలిసిన వారందరిలో వస్తుంది.

"""/" / అసలు విషయం ఏమిటంటే 2014 ఫిబ్రవరి 20న ఆగ్రాకు చెందిన విజయ్ శర్మ( Vijay Sharma ) భార్య నీలం శర్మ( Neelam Sharma ) దారుణ హత్యకు గురైంది.

పోస్ట్మార్టంలో ఆమెతో పాటు ఆమె పెంపుడు కుక్కను పదునైన ఆయుధాలతో దారుణంగా పోడిచి హత్య చేసినట్లు తేలింది.

పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేసిన ఒక చిన్న క్లూ కూడా లభించలేదు.

అయితే హత్య జరిగినప్పటినుండి విజయ్ శర్మ పెంపుడు చిలుక( Parrot ) సరిగ్గా ఆహారం తినకపోవడం, విజయ్ శర్మ మేనకోడలు ఆషు ఇంటికి వచ్చినప్పుడు అరుస్తూ ఉండడం చేసేది.

తన భార్యను చంపేటప్పుడు ఈ చిలుక ఏమైనా నిందితులను చూసి ఉండవచ్చు.బహుశా అందుకే అరుస్తుంది అని విజయ్ శర్మకు అనుమానం వచ్చింది.

"""/" / ఈ విషయం పోలీసులకు చెప్పడంతో గతంలో విచారించిన వ్యక్తులతో పాటు, విజయ్ శర్మ మేనకోడలు ఆషు ను కూడా ఆ చిలక ముందు నిలబెట్టారు.

ఎప్పుడైతే చిలుక, ఆషును చూసిందో వెంటనే అరవడం ప్రారంభించింది.పోలీసులు తమదైన శైలిలో అషును విచారించగా డబ్బు, నగల కోసం రోన్నీ అనే వ్యక్తి సహాయంతో ఈ హత్య చేసినట్లు అంగీకరించింది.

కోర్టులో చిలకను సాక్షిగా ప్రవేశపెట్టలేదు కానీ, నిందితులు నేరాన్ని అంగీకరించడంతో ప్రత్యేక న్యాయస్థానం దోషులకు జీవిత ఖైదీ విధించింది.

వైరల్ వీడియో: మండుటెండలో బైక్‌పై పెళ్లిబట్టలలో గుడికెళ్తున్న కొత్తగా పెళ్లైన జంట.. అది చూసిన ఆ ఎమ్మెల్యే..