ఎంపీ అవినాశ్ బెయిల్ రద్దుపై మెన్షన్ చేయడానికి కోర్టు అనుమతి..!

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై మెన్షన్ చేయడానికి వైఎస్ సునీతారెడ్డికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

ఈ మేరకు సునీతారెడ్డి తరపు న్యాయవాది రేపు ఉదయం మెన్షన్ చేయాలని సూచించింది.

ఎంపీ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ సునీతారెడ్డి సోమవారం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

సీబీఐ లేవనెత్తిన అంశాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు.

అవినాశ్ పై మోపబడిన అభియోగాలన్నీ కీలకమైనవన్న సునీతారెడ్డి హైకోర్టు వెకేషన్ బెంచ్ తీర్పులో కూడా లోపాలున్నాయని తెలిపారు.

ఈ క్రమంలో రేపు మెన్షన్ జాబితా ప్రకారం తీసుకుంటామని న్యాయస్థానం తెలిపింది.