20 ఏళ్ల జైలు శిక్ష.. చివరికి నిర్దోషి అంటూ తీర్పు ఇచ్చిన హైకోర్టు!

పాపం.ఒక వ్యక్తి చెయ్యని తప్పుకు దాదాపు 20 సంవత్సరాలు శిక్ష అనుభవించాడు.

అతడు 23 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు.తాజాగా 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు హైకోర్టు తీర్పు చెప్పింది.

ఇక్కడ వింత ఏమిటంటే.పాపం ఆయన నేరం చెయ్యకుండానే అతడిని 23 సంవత్సరాలు జైలులో ఉంచారు.

ఈ విషయంపై ఆ వ్యక్తి స్పందిస్తూ.నన్ను 23 సంవత్సరాలు ఉన్నప్పుడు రేప్ కేసులో అరెస్ట్ చేసారు.

ఇప్పుడు నా వయసు 43 సంవత్సరాలు.ఈ కేసులో ఇప్పటికి తీర్పు చెప్పారు.

నేను చెయ్యని నేరానికి 20 సంవత్సరాలు శిక్ష అనుభవించాను.ఈ 20 సంవత్సరాలలో నా సంపాదన కేవలం 600 రూపాయలు మాత్రమే.

జైలుకు వెళ్లడం వల్ల నా జీవితం నాశనం అయ్యిందని అతడు బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

"""/"/ నేను అరెస్ట్ అవ్వకుండా ఉన్నట్లయితే నేను కూడా అందరిలాగానే పెళ్లి చేసుకుని భార్య బిడ్డలతో హాయిగా ఉండేవాడిని.

కానీ చెయ్యని తప్పులో నన్ను అరెస్ట్ చెయ్యడం వల్ల ఇప్పుడు నా జీవితం అన్యాయం అయ్యిందని అతడు బాధపడుతున్నాడు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.లలిత్ పూర్ కు చెందిన అతడిపై అదే గ్రామంలో నివసిస్తున్న ఒక మహిళా 20 సంవత్సరాల క్రితం రేప్ కేసు పెట్టింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసారు.ట్రయల్ కోర్టు విచారణలో అతడిని దోషిగా నిర్ధారించింది.

అయితే ఈ కేసులో అతడు హైకోర్టుకు వెళ్ళాడు.హైకోర్టు తుది తీర్పు ఇచ్చేసరికి ఇన్ని సంవత్సరాలు గడిచాయి.

ఈ కేసులో ఏ పాపం చేయని అతడు 20 సంవత్సరాలు జైల్లో ఉండడం శోచనీయం అంటూ హైకోర్టు అతడిని నిర్దోషిగా తీర్పు చెప్పింది.

బుధవారం జైలు నుండి రిలీజైన అతడు తనకంటూ ఎవ్వరు లేరని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

అయితే అతడికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.దీంతో అతడికి మళ్ళీ జీవితంపై ఆశలు చిగురించాయి.

తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉష్ణోగ్రతలు..!