తెలంగాణ రైతుల ధైర్యం,ఆత్మవిశ్వాసం ముఖ్యమంత్రి కేసీఆర్:మంత్రి

సూర్యాపేట జిల్లా:రాష్ట్రంలో రైతుల ధైర్యం,ఆత్మ విశ్వాసానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.

శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రములోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మార్కెట్ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రానికి ఒక రైతు ముఖ్యమంత్రిగా ఉండడంతో అన్ని విధాల రైతుల సంక్షేమానికి పాటుపడుతూ రాష్ట్ర బడ్జెట్లో 60% వ్యవసాయానికి కేటాయించి,రైతులకు ఊరట కల్పించారన్నారు.

వ్యవసాయ రంగానికి ప్రధానంగా కావలసిన సాగునీరు,పంట పెట్టుబడి,మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు విశేష కృషి చేశారని అన్నారు.

అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం రాకముందు 20 లక్షల బోర్లతో వ్యవసాయం చేసే రైతులు నేడు 24 గంటల ఉచిత విద్యుత్తో తమకున్న భూమిని అంతా వ్యవసాయం చేస్తున్నారన్నారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా విద్యుత్ రంగంలో తనదైన విధానంతో దేశంలో ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను చరిత్రకి ఎక్కించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దీ అన్నారు.

కృష్ణ,గోదావరి జలాల్లో మన వాటా తెచ్చి తెలంగాణ రాకముందు కోటి ఎకరాల సాగు చేసే రైతులు,ప్రజలకు కావలసిన బియ్యం కూడా బయటనుంచి తెచ్చుకునే వాళ్లమని,నేడు మూడు కోట్ల టన్నుల ధాన్యం అందించి దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.

ప్రజలకు ఒక పూట తిండి పెట్టలేని విధానాలు కేంద్రం అవలంబిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు దేశానికి అన్నం పెట్టేలా తెలంగాణను తీర్చిదిద్దారన్నారు.

రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ, పంట పెట్టుబడి,రైతుబంధు అందిస్తూ రైతు సంక్షేమానికి పాటుపడుతున్నాడు అన్నారు.

రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకునే మార్కెట్లను బిజెపి ప్రభుత్వం తీసివేయాలని చూస్తే తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ మార్కెట్లను నడిపించుతామని కచ్చితంగా చెప్పి మార్కెట్లను నడుపుతున్నారన్నారు.

ఇవాళ ప్రైవేట్ వ్యక్తులు సైతం కొనుగోలలో పాల్గొంటూ ప్రభుత్వ మార్కెట్లను బలోపేతం చేస్తున్నారని అన్నారు.

గుజరాత్ సహ ఏ రాష్ట్రంలో పంట పెట్టుబడి,ఉచిత విద్యుత్,నీటి సౌకర్యం ఇచ్చే రాష్ట్రాలు లేవని,తెలంగాణలో ఇవన్నీ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను దెబ్బకొట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు.

వారి ప్రయత్నాలను తిప్పికొడుతూ అన్ని దాడులను ఎదుర్కొంటూ దేశ ప్రజలకు దిక్సూచిగా ఓ వేగుచుక్కగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచాడన్నారు.

ప్రజలు సరైన సమయంలో కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని, దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం చాలా అవసరం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్,ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి,జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్,మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ,స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

వైరల్ వీడియో: అర్ధరాత్రి కారును వెంబడించి.. ఆపై దాడి.