భయంకరమైన ప్రదేశంలో పెళ్లి చేసుకున్న జంట, ప్లేస్ పేరు వింటేనే వణికిపోతారు!

ఈ రోజుల్లో పెళ్లిళ్లు అన్నీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ గా( Destination Weddings ) మారిపోయాయి.

ఒకప్పుడు ఇంట్లో పెళ్లి వేడుకలు, బంధువులను పిలిచి ఎంజాయ్ చేసేవారు, కానీ వధూవరుల అభిరుచులు మారిపోయాయి.

అయితే కొందరు మంచి ప్రదేశాలలో తమ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటే మరి కొందరు మాత్రం ఎవరూ షాకింగ్ ప్రదేశాలలో పెళ్లిళ్లు చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.

తాజాగా ఒక జంట ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో 'క్రిప్ట్ ఆఫ్ టోంబ్స్'గా( Crypt Of Tombs ) పిలిచే ఓ భయానక ప్రదేశంలో వెడ్డింగ్ ప్లాన్ చేసింది.

"""/" / అమెరికాకి చెందిన ఈ జంట హాలోవీన్( Halloween ) సందర్భంగా పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

అయితే అదే మూడ్‌లో ఉన్న వారు అలాంటి హారర్ ప్లేస్‌లో( Horror Place ) పెళ్లి చేసుకోవాలని ఆలోచన చేశారు.

వారి వెడ్డింగ్ సంబంధించిన వీడియోలు, ఫొటోలు పంచుకోవడం ద్వారా సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లో @ohmyisabel4ever ఐడీతో వధువు ఇసాబెల్( Isabel ) 1 నిమిషం 30 సెకన్ల వీడియోను షేర్ చేసింది.

లక్షల కొద్దీ మృతదేహాల ఎముకలు, పుర్రెల మధ్య తాను జస్టిన్‌ను( Justin ) ఎలా మ్యారేజ్ చేసుకున్నానో ఆమె వివరించింది.

"""/" / నివేదికల ప్రకారం, ఈ న్యూలీ వెడ్ కపుల్ డిన్నర్ తర్వాత ఒక రహస్య మార్గం ద్వారా ప్రొఫెషనల్ టూర్ గైడ్‌ సాయంతో కలిసి ఈ భయానక నేలమాళిగకు వెళ్లినట్లు చెప్పారు.

ఆ తర్వాత అవే ఎముకలు, పుర్రెల మధ్య ఉంగరాలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు.

ఆపై అక్కడే ఫొటోషూట్ కూడా చేసుకున్నారు.పారిస్‌లోని 'ఫ్రెంచ్ కాటాకాంబ్స్'లో( French Catacombs ) చనిపోయిన 60 లక్షల మంది ఎముకలు, పుర్రెలను పారబోసినట్లు స్థానికులు చెబుతారు.

చాలామంది ఈ ప్లేస్ పేరు వింటేనే వణికిపోతారు.ఇలాంటి భయంకరమైన ప్రదేశంలో వారు పెళ్లి ఎలా చేసుకున్నారని చాలామంది నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఇది కదా ఫ్యాన్స్ కోరుకునే ఎమోషన్.. గేమ్ ఛేంజర్ అప్డేట్ ఫుల్ కిక్ ఇచ్చిందిగా!