హీరో, హీరోయిన్లలా కారులో వచ్చారు.. చిల్లరగా రోడ్డు పక్కన ఉన్న పూల కుండీలు కొట్టేశారు!

హీరోహీరోయిన్లలా కారులోంచి దిగారు.రోడ్డుపై తచ్చాడుతూ బిల్డప్ ఇచ్చారు.

వారిని చూసిన ఎవరూ వారు చేసే పని కళ్లారా చూస్తే తప్ప నమ్మలేరు.

ఎందుకంటే బిల్డప్ గా కారులోంచి దిగిన ఓ జంట రోడ్డుపై ఉన్న పూల కుండీలను కొట్టేశారు.

ఇలాంటి పాడు పని, విచిత్రమైన పని చేస్తారని వారిని చూసినవారెవరూ అనుకోరు.కానీ వాళ్లు చేసే దొంగతనాన్ని ఓ వ్యక్తి వీడియో తీశాడు.

నెట్టింట్లో పెట్టగా.లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

సోషల్ మీడియో మొత్తం ఈ విచిత్ర దొంగల వీడియోతో షేక్ అయిపోయింది.అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బెంగళూరులోని బనశంకరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విచిత్రమైన దొంగతనం జరిగింది.బసవగుడి స్టూడియో రోడ్డులో అర్ధరాత్రి ఓ కారు ఆగింది.

అందులో నుంచి ఓ జంట దిగింది.క్షణాల్లోనే వారిద్దరూ ఎవరికి వారు బిజీబిజీ అయిపోయారు.

ఒకరేమో కారు అద్దాలను క్లీన్ చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వగా.మరొకరేమో ఫుట్ పాత్ పైనున్న కుండీలను కొట్టేశారు.

వాటిని కారు డిక్కీలో పెట్టుకొని తమకేమీ తెలియదు అన్నట్లుగా అక్కడి నుంచి పరారు అయ్యారు.

"""/"/ ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.వీడియో చూసిన ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు.

ఇదేంటి బ్రో చదవుకున్నట్లు కనిపిస్తున్నావ్.అమ్మాయి వచ్చి మరీ ఈ దొంగతనం ఏంటంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరేమో మామూలుగా లేదుగా మీ దొంగతనం, బిల్డప్.ఆహా ఎవరైనా అదిరిపోవాల్సిందే అంటున్నారు.

మరి మీరూ ఓసారి ఈ వీడియోపై లుక్కేయండి.