పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు.. లీడ్లో తీన్మార్ మల్లన్న
TeluguStop.com
నల్గొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.
మూడో రౌండ్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు( Teenmaar Mallanna ) మెజార్టీ తగ్గింది.
ఇప్పటివరకు సుమారు 17,600 కు పైగా ఓట్ల మెజార్టీతో తీన్మార్ మల్లన్న లీడ్ లో ఉన్నారు.
అయితే మ్యాజిక్ ఫిగర్ కోసం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యం కానుంది.
కాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ లో( MLC By-Election Counting ) తీన్మార్ మల్లన్నకు బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి( Rakesh Reddy ) గట్టి పోటీ ఇస్తున్నారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.