నాగార్జున సాగర్ సమరం ముగింపుకు మొదలైన కౌంట్ డౌన్

ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్రముఖ రాజకీయపార్టీల ఫోకస్ అంతా నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై ఉంది.

అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఎన్నిక సమరం వేడెక్కిందనే చెప్పవచ్చు.

అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గం గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో 27 వేల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఓడిపోవడం జరిగింది.

అయితే ఇప్పుడు టీఆర్ఎస్ తరపున గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఈ స్థానం ఖాళీ అయిందని చెప్పవచ్చు.

అయితే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో 7 సార్లు గెలిచిన చరిత్ర గల జానారెడ్డి ఈ ఎన్నికలో విజయం సాధించాలని పకడ్బందీ వ్యూహాలను రచిస్తూనే ఉన్నాడు.

17 న పోలింగ్ జరగనున్న తరుణంలో ఇక ప్రచారం ముగింపుకు చేరుకున్న విషయం తెలిసిందే.

ఇక అన్ని పార్టీలు తమ చివరి అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తున్నాయి.అయితే మరి నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజల మద్దతు ఎవరికి దక్కుతుందో లేదో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

ఇప్పటికీ కాంగ్రెస్ ఎంతో కొంత టీఆర్ఎస్ కు పోటీ ఇవ్వగలమనే నమ్మకం ఉండడంతో టీఆర్ఎస్ పై కాంగ్రెస్ మాటలతూటాల దాడిని తీవ్రతరం చేసిందని చెప్పవచ్చు.

ఏది ఏమైనా ప్రజా తీర్పుకు ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా తలొగ్గాల్సిందే అని చెప్పవచ్చు.

వీడియో వైరల్: ఫోన్ రిపేర్ షాప్ లోకి వచ్చిన అనుకోని అతిధి.. సీన్ కట్ చేస్తే..