ట్రంప్‌కు మొదలైన కౌంట్‌ డౌన్‌.. ?

పదవి లేకపోతే పులి లాంటి మనిషి కూడా పిల్లిలా మారి పడరాని పాట్లు పడతాడని అమెరికా అధ్యక్షుడిని చూస్తే అర్ధం అవుతుంది.

ఇదివరకే అనాలోచిత నిర్ణయాలు, అసబంధమైన విధానాలతో నిరంతరం వార్తలో నిలిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో పదవి నుండి వైదొలగనున్న నేపధ్యంలో ఎన్నో వివాదాలు అతని చుట్టు ముట్టుతున్నాయి.

అంతే కాదు ప్రస్తుత పరిస్దితులను గమనిస్తే ట్రంప్ కు కౌంట్ డౌన్ మొదలైందనే ప్రచారం ఊపందుకుంటుంది.

ఇంతకాలం పదవి చేతిలో ఉందనే అహంకారంతో తనకు అడ్డూ అదుపు లేన్నట్టు వ్యవహరించిన ట్రంప్‌కు ప్రస్తుతం అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి.

దీనికి కారణం ఈ మధ్యకాలంలో అమెరికాలో జరిగిన ఎన్నికల్లో జో బైడెన్‌ గెలిచి ట్రంప్‌ ను వెనక్కు నెట్టడమే.

దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా సంస్థలతో పాటుగా, తన వ్యాపార భాగస్వాములుగా ఉన్న వారు కూడా ట్రంప్‌కు మొండి చేయి చూపిస్తున్నారట.

ఇక పదవి పోయాక వ్యాపారాల్లో బిజీ అవ్వాలనుకుంటున్న ట్రంప్ భవితవ్యంపై ఈ ఘటనల ప్రభావం తీవ్రంగా ఉందంటున్నారు.

అదీగాక సిగ్నేచర్‌ బ్యాంకు, ట్రంప్ వ్యక్తిగత బ్యాంకు ఖాతాను మూసివేస్తున్నట్లు ప్రకటించడం సంచలనం రేపింది.

ఇవన్నీ చూస్తుంటే త్వరలో ట్రంప్‌ ఆస్తులకు కూడా ప్రమాదం పొంచి ఉందా అనే అనుమానాలు మొదలయ్యాయట.

ఇకపోతే జనవరి 19న ట్రంప్‌ భవిష్యత్తుపై సెనేట్‌ నిర్ణయం తీసుకోవాలి.ఆ మరుసటి రోజే అంటే జనవరి 20న అమెరికా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం చేయించాలి.

అలా ఈనెల 20న బైడెన్‌ పగ్గాలు చేపట్టాక ట్రంప్ పదవి నుంచి తప్పుకుంటారు.

అప్పటి నుండే ట్రంప్‌కు కష్టాలు మొదలైయ్యేలా కనిపిస్తున్నాయనే వార్త చక్కర్లు కొడుతుంది.పదవిలో ఉన్నప్పుడు పులిలా ఉన్న ట్రంప్ మరి పదవి కోల్పోయాక ఎదురయ్యే అవరోధాలను ఎలా హ్యండిల్ చేస్తారో అనే ఆసక్తి ప్రస్తుతం అమెరికా ప్రజల్లో నెలకొందట.

దుల్కర్ లాంటి వ్యక్తి నా జీవితంలో ఉండడం నా అదృష్టం : మృణాల్ ఠాకూర్