పేటలో కౌన్సిలర్ల కయ్యం కంటిన్యూ…!

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట మున్సిపల్ చైర్మన్( Suryapet Municipal Chairman ),వైస్ చైర్మన్లపై బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు కాంగ్రెస్,బీజేపీ( Congress, BJP ) కౌన్సిలర్లతో కలిసి శనివారం ప్రవేశపెట్టిన అవిశ్వాసం రోజంతా హై టెన్సన్ నెలకొని చివరికి అసమ్మతి శిబిరంలోని 45 వార్డు కౌన్సిలర్ గుండూరి పావని హ్యాండ్ ఇవ్వడంతో వీగిపోయిన విషయం తెలిసిందే.

అవిశ్వాసం వీగి పోవడానికి కారణమైన గుండూరి పావని ఇంటి ముందు ఆదివారం బీఆర్ఎస్ అస్సమ్మతి, కాంగ్రెస్,బీజేపీ,స్వతంత్ర కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు.

ఇంతమంది కౌన్సిలర్ల శ్రమను ఒక్కరి వల్ల కోల్పోయామని ఆవేదనతో కౌన్సిలర్ పావని( Councilor Pavani ) ఇంటిపై కోడి గుడ్లు కొట్టి,దుమ్మెత్తి పోస్తూ శాపనార్థాలు పెట్టారు.

అవిశ్వాసం నోటీస్( Annapurna ) పై సంతకం పెట్టి పొత్తు ధర్మం పాటించకుండా అన్యాయం చేశారని ఆరోపించారు.

విషయం తెలుసుకొని బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ( Annapurna ) తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు.

దీనితో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.అసమ్మతి కౌన్సిలర్లు చైర్మన్ ను అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది.

ఒక వర్గంపై మరో వర్గం దూషణల పర్వానికి దిగారు.ఘర్షణ వాతావరణం ముదరడంతో అవిశ్వాస కౌన్సిలర్లకు నాయకత్వం వహించిన కొండంపల్లి నిఖిల రెడ్డిపై మున్సిపల్ చైర్ పర్సన్,ఆమె అనుచరులు దాడి చేయడంతో తలకు గాయాలయ్యాయి.

పరిస్థితి చేయి దాటేలా ఉండడంతో డిఎస్పీ నాగభూషణం, టౌన్,రూరల్ సీఐలు, ఎస్ఐలు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టిఅక్కడి నుండి పంపించడంతో ప్రస్తుతానికి ఘర్షణ వాతావరణం సద్దుమణిగింది.

కానీ,పేట మున్సిపల్ హీట్ మాత్రం కంటిన్యూ అవుతుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

వైసీపీ విషయంలో చంద్రబాబు నిర్ణయం మార్చుకున్నారా ?