చలికాలం లో దగ్గు నుండి.. ఈ ఇంటి చిట్కాలతో ఉపశమనం..
TeluguStop.com
చాలా మంది మారుతున్న వాతావరణం వల్ల దగ్గు లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు.
అయితే దగ్గు బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్, అలర్జీ, సైనస్ ఇన్ఫెక్షన్ లేకపోతే జలుబు కారణంగా వస్తుంది.
దగ్గు సమస్య వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇక ముఖ్యంగా చలికాలంలో మాత్రం దగ్గు సమస్య ఎక్కువగా ఉంటుంది.
ఆ సమయంలో పలు ఇంటి చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
అయితే ఆ ఇంటి చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.దగ్గు సమస్యలతో బాధపడుతున్నప్పుడు అల్లం టీ చేసుకొని తాగడం చాలా మంచిది.
అల్లం లో యాంటీ బ్యాక్టీరియల్, ఆంటీ ఇన్ఫ్లమెటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.అందుకే ఇది జలుబు అలాగే దగ్గు సమస్య నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది.
అలాగే చలికాలంలో దగ్గు సమస్యతో బాధపడుతున్నప్పుడు తులసి యొక్క కషాయాలను తాగితే మేలు జరుగుతుంది.
ఇందులో యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.ఇవి దగ్గు సమస్యను దూరం చేయడానికి సహాయపడతాయి.
అందుకే తులసి కషాయాన్ని తీసుకొని దగ్గుకు దూరంగా ఉండవచ్చు.అదేవిధంగా దగ్గు వస్తున్నప్పుడు తేనె తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.అందుకే అల్లంతో పాటు తేనె కలిపి తీసుకుంటే దగ్గు సమస్య నుండి త్వరగా విముక్తు లభిస్తుంది.
అదేవిధంగా ఒక టీ స్పూన్ పసుపులో చిటికెడు ఎండుమిర్చి, తేనె కలిపి తింటే దగ్గు సమస్య నుంచి బయటపడవచ్చు.
"""/"/
అదేవిధంగా మొలెత్తి, తేనె మిశ్రమాన్ని తీసుకొని తాగితే దగ్గు సమస్య నుండి బయటపడవచ్చు.
అదేవిధంగా దగ్గు సమస్య ఉన్నప్పుడు వెల్లుల్లి తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది.ఎందుకంటే వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
అందుకే నెయ్యిలో వెల్లుల్లిని వేయించి తరచూ తీసుకుంటే దగ్గు సమస్య దూరం అవుతుంది.
బాలయ్య డాకు మహారాజ్ మూవీ నుంచి మరో ట్రైలర్ రాబోతుందా.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్!