పత్తి రైతుకు కోపం వచ్చింది… రోడ్డుకు అడ్డంగా పత్తి లోడు పెట్టాడు

నల్లగొండ జిల్లా:అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లుగా అన్నదాతల పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారిపోతుందని,ఆరుగాలం కష్టం చేసి,అప్పులు చేసి పండించిన పంటని అమ్ముకునే స్థితి లేకుండా పోయిందని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వివరాలకు వెళితే.నల్గొండ జిల్లా దేవరకొండ పత్తి కొనుగోలు కేంద్రానికి హలియా నుండి పత్తి లోడుతో వచ్చాడు.

మూడు రోజులు దాటినా పత్తి దిగుమతి చేసుకోకపోవడంతో విసుగుచెంది తను తీసుకువచ్చిన పత్తి లోడు వాహనం కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై అడ్డంగా పెట్టి నిరసన తెలియజేశాడు.

దీనితో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అడ్డుగా పెట్టిన వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

ఈ సందర్భంగా బాధిత రైతు మాట్లాడుతూ తేమ శాతం ఉన్నప్పటికీ కూడా దిగుమతి చేయడం లేదని,మూడు,నాలుగు రోజుల నుండి పస్తులు ఉంటూ పడిగాపులు కాసినా పండించిన పత్తిని అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నామని,అధికారులు తేమ పేరుతో వేధిస్తున్నారని,ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ల వాహనాలను దిగుమతి చేసుకుంటున్నారని ఆరోపించాడు.

అదేవిధంగా మరోపక్క దళారులతో కుమ్మక్కై దళారులు తీసుకొచ్చిన వాహనాల పత్తిని మాత్రమే దిగుమతి చేసుకుంటూ రైతులు తీసుకొచ్చి పత్తి దిగుమతి చేయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు.

మూడునాలుగు రోజుల నుండి ఇక్కడే పడిగాపులు కాస్తుంటే ట్రాక్టర్ కిరాయిలు కట్టలేక పోతున్నామని,ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తే ఆశతో తీసుకొచ్చినందుకు వేధిస్తున్నారని,ఇప్పటికైనా సిసిఐ ఉన్నతాధికారులు స్పందించి రైతు తీసుకువచ్చిన పత్తిని దిగుమతి చేయాలని ప్రాధేయపడ్డాడు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇంట తీవ్ర విషాదం.. అసలేం జరిగిందంటే?