ఆ గుహలోకి వెళ్తే చావే అంటున్న శాస్త్రవేత్తలు.. కారణం ఏంటంటే?
TeluguStop.com
కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే అప్పటిలో ఎక్కువగా న్యూస్ పేపర్ మాత్రమే ఆధారం.
కానీ, ఇప్పుడు మాత్రం న్యూస్ పేపర్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, కొన్ని క్షణాల్లోనే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిందో సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవచ్చు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఏదైనా ఘటన జరిగిన వెంటనే సంబంధిత వీడియోలు వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ సర్వసాధారణం.స్మార్ట్‌ఫోన్ లేనివారు చాలా తక్కువగా కనిపించే స్థితి.
"""/" /
ఈ స్మార్ట్‌ఫోన్ సహాయంతో మనం కూర్చున్నచోటే ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నాం.
ఈ నేపథ్యంలో, ఒక ప్రత్యేకమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దక్షిణ అమెరికాలోని కోస్టారికాలో( Costa Rica ) ఉన్న "కేఫ్ ఆఫ్ డెత్"( Cave Of Death ) అనే గుహ గురించి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
"కేఫ్ ఆఫ్ డెత్" అనే ఈ గుహ గురించి చెప్పుకుంటే, ఇది చాలా ప్రమాదకరమైనదిగా వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో ఒక వ్యక్తి ఈ గుహ సమీపానికి వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని చెబుతున్నారు.
దీనిపై అనేక కథనాలు సోషల్ మీడియాలో ప్రసారమవుతున్నాయి.ఈ గుహలోకి వెళ్లిన అనేక చిన్న జీవులు అక్కడే చనిపోతున్నాయట.
"""/" /
ఈ నేపథ్యంలో, కోస్టారికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌కి చెందిన శాస్త్రవేత్తలు ఈ గుహను పరిశీలించారు.
ఈ పరిశోధనల్లో ఈ గుహ చిన్నదైనా, దాని నుంచి భారీగా కార్బన్ డయాక్సైడ్( Carbon Dioxide ) విడుదల అవుతుందని నిర్ధారించారు.
గుహ సమీపంలో అగ్నిపర్వతం ఉండడం వల్ల భూమి పొరల్లో ఏర్పడిన పగుళ్ల ద్వారా కార్బన్ డయాక్సైడ్ లీక్ అవుతోంది.
గంటకు సుమారు 30 కిలోల కార్బన్ డయాక్సైడ్ ఈ గుహలో నుండి వస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉండటంతో, గుహలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతోంది.జీవ ప్రాణుల మనుగడకి అవసరమైన ఆక్సిజన్ అందక, ఈ గుహలోకి వెళ్లిన వెంటనే చిన్న జంతువులు మరణిస్తున్నాయి.
ఈ కారణంగా, "కేఫ్ ఆఫ్ డెత్" పేరు వైరల్ అవుతూ అందరిని భయపెడుతోంది.
చిరంజీవి సినిమాలో లవ్ ట్రాక్ లేదా.. డైరెక్టర్ అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్ ఇదేనా?