ఈషా అంబానీ పుస్తెల తాడు గురించి నోరెళ్లబెట్టే నిజం.. అంబానీ కూతురంటే ఆ మాత్రం ఉండాలి కదా
TeluguStop.com
భారత దేశంలోనే కాకుండా ప్రపంచ కుబేరుల జాబితాలో కూడా టాప్ లో ఉండే ముఖేష్ అంబానీ తాజాగా తన కూతురు ఈషా అంబానీ వివాహం చేసిన విషయం తెల్సిందే.
ఈషా అంబానీ పెళ్లి ఇండియాలో ఎప్పుడు జరగని విధంగా నభూతో నభవిష్యతి అన్నట్లుగా సాగిన విషయం తెల్సిందే.
అధికారికంగా 700 కోట్లు అంటున్నారు కాని, ఈ పెళ్లి కోసం అనధికారికంగా వెయ్యి కోట్లకు పైగానే అంబానీ ఫ్యామిలీ ఖర్చు చేసి ఉండవచ్చు అనేది అందరి మాట.
ఆనంద్ పిరమిల్‌తో ఈషా అంబానీ వివాహంకు బాలీవుడ్ తారలు, క్రీడాకారులు ఇంకా ఎంతో మంది సెలబ్రెటీలు, హాలీవుడ్ స్టార్స్, ఇంటర్నేషనల్ సెలబ్రెటీలు ఎంతో మంది కూడా హాజరు అయ్యారు.
ఇంత వైభవంగా జరిగిన పెళ్లిలో ఈషా అంబానీ మెడలో ఆనంద్ కట్టిన పుస్తెల తాడు గురించి తాజాగా ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
వరుడి ఇంటి వారు చేయించిన పుస్తెల తాడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తెల తాడుగా రికార్డు సృష్టించింది.
అంబానీ వారి ఇంటి అమ్మాయిని అంత సాదా సీదాగా ఎలా తమ ఇంటికి ఆహ్వానిస్తామని అనుకున్నారో ఏమో కాని ఆనంద్ కుటుంబ సభ్యులు ఏకంగా 90 కోట్లు ఖర్చు చేసి ఈషా కోసం పుస్తెలు చేయించారట.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అత్యంత ఖరీదైన వజ్రాలతో పాటు, ప్లాటినం వాడి ఈ పుస్తెల తాడు చేసినట్లుగా ముంబయి వర్గాల వారు అంటున్నారు.
పెస్తలతో పాటు, వాటిని కట్టెందుకు వేసుకునే తాడుతో అంటే పుస్తెల తాడు మొత్తం కలిపి 90 కోట్లు అయినట్లుగా చెబుతున్నారు.
సహజంగా మన ఇళ్లలో అయితే రెండు మూడు తులాలతో పుస్తెల తాడు చేయిస్తేనే ఆహా ఓహో అంటారు.
మద్య తరగతి వారు పుస్తెల తాడు కోసం లక్ష రూపాయల వరకు ఖర్చు చేస్తారు.
లేని వారు కేవలం పుస్తెలను మూడు నాలుగు గ్రాముల్లో చేయించి పెడతారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఈషా పుస్తెల తాడు 90 కోట్లు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో జనాలు షాక్ అవ్వడంతో పాటు, విమర్శలు చేస్తున్నారు.
మరీ అంత ఖర్చు అవసరమా, పేదలకు సాయం చేస్తే బాగుంటుంది కదా అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈషా 90 కోట్ల పుస్తెల తాడు ధరించడంపై మీ అభిప్రాయం ఏంటో మాతో షేర్ చేసుకోండి.