అవినీతిని కిలో గ్రాముల్లో తూకం వేస్తున్నారు.. ఎక్కడో తెలుసా..?

ఇటీవల అవినీతి అనేది బాగా పెరిగిపోయింది.అధికార పార్టీలు తమ పవర్‌ను ఉపయోగించుకుని అవినీతికి పాల్పడటం, అక్రమాలు చేయడం లాంటివి సాధారణం అయిపోయాయి.

అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు చేయడం కూడా కామన్.అంతేకాకుండా అవినీతి అధికారులు, ప్రజాప్రతినిధుల అవినీతి, అక్రమాలకు సంబంధించి కథనాలు మీడియాలో వస్తూ ఉంటాయి.

అలాగే న్యూస్ పేపర్లలో ప్రచురితం అవుతూ ఉంటాయి. """/" / అయితే ఇంగ్లండ్‌లోని( England ) ఒక పట్టణంలో వింత సంప్రదాయం ఉంది.

అవినీతికి పాల్పడే మేయర్ ను గుర్తించేందుకు వింత పద్దతి పాటిస్తున్నారు.బరువు ద్వారా అవినీతిని కనిపెడుతున్నారు.

మేయర్ పదవి( Mayor ) బాధ్యతలు చేపట్టేముందు వారి బరువును కొలుస్తారు.అలాగే అధికారం నుంచి దిగిపోయేటప్పుడు మరోసారి బరువు చెక్ చేస్తారు.

ఒకవేళ అధికారం నుంచి దిగిపోయేటప్పుడు బరువు పెరిగినట్లు అయితే అవినీతికి పాల్పడినట్లుగా ప్రజలు భావిస్తారు.

అయితే ఈ సంప్రదాయం అక్కడ ఇప్పుడు మొదలైంది కాదు.ఏకంగా 400 ఏళ్ల క్రితం అక్కడ ఈ సంప్రదాయం మొదలైంది.

ఎన్నికలు పూర్తైన తర్వాత సంప్రదాయ దుస్తులు ధరించిన మేయర్‌ను ప్రజల సమక్షంలో త్రాసుపై కూర్చోబెట్టి బరువును నమోదు చేస్తారు.

"""/" / ఏడాది తర్వాత పదవి నుంచి దిగిపోయే ముందు మళ్లీ ప్రజల సమక్షంలో బరువు నమోదు చేస్తారు.

ఒకవేళ బరువు పెరిగినట్లు అయితే పన్ను చెల్లింపుదారుల నుంచి ఆదాయాన్ని పొంది బరువు పెరిగినట్లు నమ్ముతారు.

అదే బరువు తగ్గితే ఆయన అవినీతికి పాల్పడలేదని అర్థం చేసుకుంటారు.దీంతో ఆయనను హర్షధానాలతో ప్రశంసిస్తారు.

ఇలా ఇంగ్లాండ్‌లోని హై వైకోంబ్ పట్టణంలో( High Wycombe ) అవినీతిని తూకం వేస్తున్నారు.

ఈ వింత సంప్రదాయం ఆ పట్టణంలో మాత్రమే పాటిస్తున్నారు.ఎప్పటినుంచో ఈ సంప్రదాయం ఉండగా.

ఇటీవల దాని గురించి బాగా చర్చ జరుగుతోంది.