తెలంగాణ ఐఏఎస్ అధికారిపై అవినీతి ఆరోప‌ణ‌లు.. ఢిల్లీ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

తెలంగాణ ఐఏఎస్ అధికారి ర‌జ‌త్ కుమార్ పై వ‌చ్చిన అవినీతి ఆరోప‌ణ‌ల‌పై ఢిల్లీ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

ఈ వ్య‌వ‌హారంలో డీవోపీటీ వైఖ‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.ఆరోప‌ణ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోకుండా రాష్ట్ర ప్ర‌భుత్వానికి పంప‌డంపై మండిపడింది.

ర‌జ‌త్ కుమార్ కుమార్తె వివాహానికి సంబంధించిన బిల్లుల‌ను ప్రైవేట్ కాంట్రాక్ట‌ర్లు చెల్లించార‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

ఈ క్ర‌మంలో ఆరోప‌ణ‌లపై చ‌ర్చ‌లు తీసుకోవాల‌ని డీవోపీటీకి ఫిర్యాదులు వ‌చ్చాయి.అయితే, ఆరోప‌ణ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోకుండా డీవోపీటీ నేరుగా తెలంగాణ సీఎస్ కు ఫిర్యాదును పంపారు.

దీంతో గ‌వినోళ్ల శ్రీనివాస్ అనే వ్య‌క్తి ఈ విష‌యంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు.

పిటిష‌న్ పై న్యాయ‌ముర్తి య‌శ్వంత్ వ‌ర్మ ధ‌ర్మాస‌నం విచార‌ణ జ‌రిపింది.స్పెష‌ల్ సీఎస్ గా ఉన్న ర‌జ‌త్ కుమార్ పై సీఎస్ ఎలా చ‌ర్య‌లు తీసుకుంటార‌ని ప్ర‌శ్నించింది.

డీవోపీటీకి నోటీసులు జారీ చేసి రెండు వారాల్లో స‌మాధానం ఇవ్వాల‌ని ఆదేశించింది.అనంత‌రం త‌దుప‌రి విచార‌ణ‌ను సెప్టెంబ‌ర్ 30కి వాయిదా వేసింది.

ఏడుస్తున్న పిల్లోడిని ఓదార్చిన కుక్క.. బ్యూటిఫుల్ వీడియో వైరల్..