ఆ ఆదితెగ లో కూడా కనిపిస్తున్న కరోనా

అండమాన్ నికోబార్ దీవుల్లో నివసించే ఆదివాసీ తెగ లో కూడా కరోనా కలకలం సృష్టించింది.

ఆ దీవుల్లో అంతరించిపోయే జాతిలో గ్రేటర్ అండమానీస్ జాతి ఒకటి.ఈ జాతిలో కేవలం 53 మంది మాత్రమే ఉండగా, వారిలో నలుగురికి కరోనా నిర్ధారణ అయినట్లు వైద్య అధికారులు చెబుతున్నారు.

అయితే అంతరించిపోతున్న ఈ జాతి ప్రజలు ఆధునిక మనిషితో కలిసి ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఈ జాతిలో ఉన్న మొత్తం 53 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి నిర్ధారణ కాగా,వారిలో ఇద్దరిని మాత్రం ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా,మిగిలిన ఇద్దరిని హోమ్ క్వారంటైన్ చేసినట్లు తెలుస్తుంది.

అయితే టెస్ట్ లకు వారంతా సహకరించినట్లు వైద్యులు తెలిపారు.అండమాన్ నికోబార్ దీవుల్లో జురావాస్, నార్త్ సెంటినలిస్, గ్రేటర్ అండమానీస్, ఓంగే, షోమ్పెన్ ఆదిమజాతి ప్రజలు నివసిస్తున్నారు.

అయితే ఈ కోవిడ్ టెస్టులకు ఆదిమజాతి ప్రజలు సహకరిస్తున్నారని, నలుగురికి నిర్ధారణ అయినట్లు వైద్య అధికారులు చెప్తున్నారు.

అయితే ఈ ఆదిమజాతి లోని జువారిస్, నార్త్ సెంటినలిస్ జాతి ప్రజలు మాత్రం ఇంకా ఆధునిక ప్రజలతో మమేకం కాలేదని, దీనితో వీరి ఆరోగ్యపరిస్థితిని గురించి తెలుసుకోవడం కష్టంగా మారిందని అధికారులు చెప్తున్నారు.

కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ద్వీప సమూహం లో 2,985 కోవిడ్ కేసులు నమోదు కాగా,ఇప్పటివరకు 37 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది.

అయితే హెల్త్ అండ్ ఎమెర్జెన్సీ సభ్యులు అత్యవసరంగా అక్కడకు వెళ్లి పరీక్షలు నిర్వహించగా వారంతా కూడా చాలా సహకరించినట్లు వైద్య అధికారి వెల్లడించారు.

చాలా మంది తెగ సభ్యులు పోర్ట్ బ్లెయిర్ మరియు వారి ఏకాంత ద్వీపం మధ్య ప్రయాణిస్తూ ఉంటారు.

అయితే ఈ క్రమంలోనే వారికి ఈ వైరస్ సంక్రమించి ఉంటుంది అని వైద్య అధికారులు భావిస్తున్నారు.

దానికి తోడు వారిలో కొందరు నగరంలో చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేసుకుంటూ ఉంటారని, అది కూడా ఒక కారణం కావచ్చు అంటూ వైద్య బృందం భావిస్తుంది.

అయితే నివసించే ఇతర తెగల వారికి ఈ మహమ్మారి వ్యాపించకుండా చూడడమే ఇప్పుడు ఉన్న ప్రధాన సమస్యగా అధికారులు భావిస్తున్నారు.

సినీ నిర్మాత బండ్ల గణేశ్ పై కేసు నమోదు