మురుగునీటి ద్వారా కరోనా వైరస్ సోకుతుందా…?

కరోనా వైరస్ గురించి రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తుంది.ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లమందికిపైగా కరోనా వైరస్ వ్యాపించింది.

ఇంకా వేగంగా వ్యాపిస్తుంది తప్ప తగ్గటం లేదు.త్వరలోనే ఈ వైరస్ కి వ్యాక్సిన్ వస్తుందని ప్రపంచ ప్రజలు ఎదురు చూస్తున్నారు.

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

అది ఏంటంటే.సాధారణంగానే కరోనా వైరస్ ఎలా సోకుతుందో తెలియదు.

ఇంకా ఈ తరుణంలోనే అది ఏ విధంగా వ్యాపిస్తుందనే తీరుపై పరిశీలించడానికి హైదరాబాద్‌లోని సీసీఎంబీ మురుగునీటి నమూనాలపై దృష్టి సారించింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఏడు సివరేజీ ప్లాంట్లలో మురుగునీటిని సేకరించి పరిశీలిస్తుంది.దీని కోసం దాదాపు 30 మంది శాస్త్రవేత్తలతో కలిసి నాలుగు బృందాలుగా ఏర్పడి రంగంలోకి దిగాయి.

అంబర్‌పేట, నాగోల్‌, అత్తాపూర్‌, నల్లగండ్ల ప్రాంతాలలో నమూనాలు సేకరించారు.ఇంకా అందులో కరోనా వైరస్ రెండొవ దశలో ఉన్నట్టు వారు గుర్తించారు.

కరోనా వైరస్ మురుగునీటిలో ద్వారా కూడా వ్యాపిస్తుంది వారు తెలిపారు.ఈ మురుగునీటి ద్వారా ఎంతోమంది లక్షణాలు లేకుండానే కరోనా బారిన పడుతున్నారని చెప్పారు.

క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తికి తగిలిన జాక్‌పాట్.. ఎంతంటే..??